వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు కలిసి నటించిన ఎఫ్ 2 సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయంను సాధించిన విషయం తెల్సిందే. అనీల్ రావిపూడి సంక్రాంతికి వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక అనీల్ రావిపూడికి సంక్రాంతి డైరెక్టర్ అనే పేరు కూడా వచ్చింది. గత ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చిన అనీల్ రావిపూడి కరోనా వల్ల ఈ ఏడాది సంక్రాంతిని మిస్ చేసుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కంటే ముందే ఎఫ్ 3 ని తీసుకు రావాలనుకున్నారు. ఆగస్టులో ఎఫ్ 3 ని విడుదల చేయాలనుకున్నా కరోనా సెకండ్ వల్ల విడుదల వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అనుకున్న సమయంకు పూర్తి చేసి విడుదల విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టులో సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నా కూడా కరోనా టెన్షన్ ఇంకా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు చాలా సినిమాలు అప్పుడు విడుదలకు ఉన్నాయి. కనుక సంక్రాంతి వరకు సినిమాను వాయిదా వేసి అనీల్ రావిపూడి సెంటిమెంట్ ప్రకారం విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఎఫ్ 2 లో భార్య భర్త ప్రియుడు ప్రియురాలి మద్య సరిగే సంఘటనలు, భర్త ప్రియుడు ఎలా ఇబ్బందులు పడ్డారు అనేది ఫన్నీగా దర్శకుడు చూపించాడు. ఎఫ్ 3లో మాత్రం సినిమా కథ మొత్తం డబ్బు సంపాదన పై ఉంటుందని అంటున్నారు. సినిమా లో ప్రత్యేక ఆకర్షణ గా సునీల్ నిలువబోతున్నాడు. అన్ని విధాలుగా ఎఫ్ 3 పై అంచనాలు భారీగా ఉన్నాయి. కనుక మెల్లగా సంక్రాంతికి వస్తే ఇది కూడా వంద కోట్ల సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.