ట్యాలెంటెడ్ అనీల్ రావిపూడి బ్లాక్ బస్టర్ మూవీ `ఎఫ్ 2` కి సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రంలో వెంకటేష్- వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. 2021 జనవరిలో షూటింగ్ ప్రారంభమవుతోంది.
నేడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఎఫ్ 3 మూవీని అధికారికంగా ప్రకటించారు. ఎఫ్ 3 టైటిల్ తో వెంకటేష్ - వరుణ్ తేజ్ లపై పోస్టర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మునుపటిలానే ఫన్ ఫ్రస్టేషన్ ఈ మూవీలోనూ ఉంటుంది. ఈసారి డబ్బు తో పుట్టే ఫ్రస్టేషన్ దానిలోంచి ఫన్ చూపిస్తున్నారని పోస్టర్ చెబుతోంది. డబ్బు కట్టలు పోగేసుకుని వెంకీ వరుణ్ పరుగులు పెడుతున్న వైనం ఎంతో ఫన్నీ సెటప్ తో ఆకర్షించింది.
ఎఫ్ 2 లో పెళ్లాల వల్ల పుట్టే ఫ్రస్టేషన్ ని ఫన్ ని చూపించారు. ఇప్పుడు అందుకు భిన్నమైన కథనే రావిపూడి ఎంచుకున్నారని అర్థమవుతోంది. ఇక ఇది సీక్వెల్ తరహా కథాంశం కాదని అనీల్ రావిపూడి ఇంతకుముందే తెలిపారు. దానికి తగ్గట్టే ఓ ఫ్రెష్ స్టోరీతోనే ఈ మూవీని తెరకెక్కించనున్నారని.. వెంకీ మార్క్ కామెడీ వరుణ్ మార్క్ ఎనర్జీతో ఆకట్టుకుంటుందని అర్థమవుతోంది. వెంకీతో ఎఫ్ 2 తరహాలోనే వరుణ్ సింక్ అయ్యి వర్క్ చేయనున్నారు. ఇందులోనూ ఆ ఇద్దరి కాంబినేషన్ సీన్లు ఫన్ రైడర్ ని తలపిస్తాయనే అర్థమవుతోంది. ఎఫ్ 3 లో వెంకీ కోసం కొన్ని అద్భుతమైన సంభాషణల్ని రావిపూడి రాశారట. ఈ మూవీలో కథానాయకుల బాడీ లాంగ్వేజ్ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుందని ఎఫ్ 2 కంటే ఎగ్జయిట్ చేస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.