100 కోట్ల మార్క్ ను టచ్ చేసిన 'ఎఫ్ 3'

Update: 2022-06-05 05:30 GMT
వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా 'ఎఫ్ 3' సినిమాను తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మాణంలో .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో తమన్నా - మెహ్రీన్ కథానాయికలుగా అలరించారు. సోనాల్ చౌహాన్ .. పూజ హెగ్డే అందాల సందడి చేశారు. భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా, తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. సినిమా థియేటర్స్ లో రన్ అవుతున్నప్పటికీ, ప్రమోషన్స్ మాత్రం ఆపడం లేదు.

క్రితం నెల 27వ తేదీన విడుదలైన ఈ సినిమా, నిన్నటితో 9  రోజులను పూర్తిచేసుకుంది. ఈ 9 రోజులలో 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన  సందర్భంగా మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ బ్యానర్ 'బొమ్మరిల్లు' నుంచి కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్లను అందిస్తూ వస్తున్నామనీ, ప్రేక్షకులు ఆదరిస్తూ  ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందని దిల్ రాజు అన్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ తమకి మరింత ఎనర్జీ ఇచ్చిందనీ,
అందువల్లనే 'ఎప్ 4' చేయడానికి రెడీ అవుతున్నామని అనిల్ రావిపూడి చెప్పారు.

వెంకటేశ్ కి కామెడీపై పట్టుంది. సరైన టైమింగ్ తో ఆయన కామెడీని చప్పరించేస్తారు. 'ఎఫ్ 2' ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక 'ఎఫ్ 3లోను ఆయన డైలాగ్ డెలివరీకీ  .. బాడీ లాంగ్వేజ్ కి హ్యాట్సా ఫ్ చెప్పాల్సిందే. ఇక సునీల్ .. అలీ .. రాజేంద్రప్రసాద్ అంతా కూడా నవ్వుల సందడి చేశారు.  వీళ్లందరి ధాటికి తట్టుకుంటూ వరుణ్ తేజ్ తన ప్రత్యేకతను  చాటుకోడం విశేషం. వరుణ్ తేజ్ కి లోకూడా మంచి మార్కులే వచ్చాయి. మొత్తానికైతే 'ఎఫ్ 4' ను కూడా సెట్స్  పైకి తీసుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చేశారు.

ఈ సినిమా తరువాత అనిల్ సినిమా బాలయ్యతో ఉండనుంది. ఈ సినిమాపై తన మార్కు కామెడీ తక్కువగా ఉంటుందనీ, బాలయ్య  మార్కు యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుందని అనిల్ రావిపూడి చెప్పారు. ఇంతవరకూ బాలయ్య తెరపై కనిపిస్తూ వచ్చినదానికి భిన్నంగా ఆయనను ఈ సినిమాలో చూపించనున్నానని అన్నారు. ఇది తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుందని చెప్పారు. ఈ సినిమాలో కూతురు పాత్ర కోసం శ్రీలీల ఖరారైపోయింది. కథానాయికలుగా ప్రియమణి - మెహ్రీన్  పేర్లు వినిపిస్తున్నాయి.  
Tags:    

Similar News