యాక్షన్ చిత్రాల్లో జేమ్స్ బాండ్ మూవీస్ కు ఎంత క్రేజ్ ఉందో.. ఆ స్థాయిలో ఫ్యాన్స్ ను సంపాదించుకున్న సిరీస్ లలో 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఒకటి. నిజానికి.. లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ కు మాత్రమే కాదు.. యాక్షన్ చిత్రాలకూ భారీగా అభిమానులు ఉంటారు. వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రేక్షకుల్లో వీరి షేర్ చాలా ఎక్కువే. అందుకే.. వీరికోసం చాలా యాక్షన్ చిత్రాలు రూపొందుతుంటాయి. కంటెంట్ ఉండాలేగానీ.. సక్సెస్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. సక్సెస్ కు కేరాఫ్ గా నిలిచింది సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్.
ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు 8 చిత్రాలు వచ్చాయి. ఈ సిరీస్ లు అన్నీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లో 9వ చిత్రం రాబోతోంది. 'F9' టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం కోసం వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. 'F9' సునామీ సమ్మర్ లో థియేటర్లను తాకాల్సి ఉన్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో ఆగిపోయింది. జస్టిన్ లిన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ట్రైలర్ ఎప్పుడో రిలీజై, అభిమానులను విశేషంగా అలరించింది. అయితే.. కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు ఇంకా సద్దు మణగకపోవడంతో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయలేదు మేకర్స్.
ఇటీవల అమెరికా, బ్రిటన్ దేశాల్లో రిలీజ్ చేశారు. ఈ భారీ యాక్షన్ ప్యాక్డ్ మూవీని చూసి ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. మిలియన్ డాలర్ల కొద్దీ కలెక్షన్స్ రాబట్టి.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ సత్తా ఏంటో చాటిచెప్పింది. విన్ డీజిల్, మిచెల్ రోడ్రిగెజ్, టైరెస్ గిబ్సన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని ఇప్పుడు ఇతర దేశాల్లోనూ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఆగస్టు 5వ తేదీన ఇండియన్ బాక్సాఫీస్ పై దండ యాత్ర చేయబోతోంది ఎఫ్-9. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇండియాలో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు. మరి, ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ నమోదు చేస్తుందన్నది చూడాలి. ఇదిలాఉంటే.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ ను ముగించేందుకు ఈ చిత్ర యూనిట్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం విన్న ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు.
'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్ కు ముగింపు పలికే సమయం వచ్చేసిందని విన్ డీజిల్ ఆ మధ్య ప్రకటించాడు. ప్రస్తుతం 9వ సిరీస్ రిలీజ్ కానుండగా.. మరో రెండు సిరీస్ లు వదిలిన తర్వాత క్లోజ్ చేస్తామని వెల్లడించాడు. ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూల్లో ఈ మేరకు అనౌన్స్ చేశాడు డీజిల్. 2023 లోపు 10, 11 సిరీస్ లను రిలీజ్ చేసి ఈ సిరీస్ చాప్టర్ క్లోజ్ చేయాలని భావిస్తున్నట్టు విన్ డీజిల్ వెల్లడించాడు.
''ఈ సిరీస్ ను ఇష్టపడే వారికి ఇది జీర్ణించుకోలేని విషయమే. కానీ.. ఏ కథకైనా ఎక్కడో ఒక చోట ముగింపు పలకాల్సి ఉంటుంది.'' అని అన్నాడు విన్ డీజిల్. 2003లో మొదలైన ఈ సిరీస్.. పద్దెనిమిదేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది. మరో రెండు సిరీసులు తీసి.. రెండు దశాబ్దాల తర్వాత ఘనంగా ముగింపు పలకాలని భావిస్తున్నారు మేకర్స్.