టాలీవుడ్ లో ఒకరి కోసం అనుకున్న కథలు మరొకరు చేయడం సాధారణం. గతంలో పవన్ కళ్యాణ్ చేయాల్సిన అతడు-పోకిరి మహేష్ చేతికి వెళ్లి ఎలా ఇండస్ట్రీ హిట్స్ అయ్యయో చూసాం. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అలాంటి కథే సైరా వెనుక కూడా ఉందట. పరుచూరి బ్రదర్స్ ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం ఇప్పటి మాట కాదు. ఇరవై ఏళ్ళ క్రితమే రాసుకున్నారు. బాలకృష్ణ హీరోగా తీద్దామని ప్రతిపాదన ఉంచితే నిర్మాత ఏంఎస్ రెడ్డితో పాటు అప్పుడు భీకరమైన ఫాం లో ఉన్న దర్శకుడు జయంత్ సి పరాన్జీతో తీయాలని ఆలోచన కూడా చేసారట. తీరా బడ్జెట్ లెక్కలు వేసుకుని చూస్తే 50 కోట్ల దాకా లెక్క తేలింది. గెటప్ ఎలా ఉండాలి అనే స్కెచ్ కూడా వేసుకున్నారు.
ఆ సమయానికే బాలయ్య భారీ బడ్జెట్ సినిమాలు అశ్వమేధం-శ్రీ కృష్ణార్జున విజయం-నిప్పు రవ్వ లాంటివి అటు నిర్మాతకు ఇటు బయ్యర్లకు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. వీటికి తోడు సౌందర్య మరణంతో నర్తనశాలను ఆపేయాల్సి వచ్చింది. ఈ తరుణంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బంది తప్పదని గ్రహించి అంత మొత్తం పెట్టుబడి పెట్టడం ఇష్టం లేక డ్రాప్ అయ్యారట. దీంతో కొంతకాలం తర్వాత అది చిరంజీవి దగ్గరకు వెళ్ళింది. ఆ సమయానికి ఇది తాను సైతం రిస్క్ గా ఫీలయ్యారు చిరంజీవి. మార్కెట్ ఉన్నప్పటికీ ఓవర్సీస్ అప్పుడు లేదు. దేశవ్యాప్తంగా విడుదల చేయటం బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఉండేది. దాంతో ఆయనా డ్రాప్ అయ్యారు.
మళ్ళి ఇన్నేళ్ళ తర్వాత బాహుబలి వేసిన మార్గం హింది సినిమాలను మించి యుఎస్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద పెత్తనం చెలాయించడం లాంటివి సైరాను సెట్స్ మీదకు వెళ్ళేలా చేసాయి. తెలుగు సినిమా వెయ్యి కోట్ల రేంజ్ లో ఉందని రాజమౌళి ఋజువు చేసాక అందరికి ధైర్యం వచ్చింది. అందుకే సాహో లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ కు సైతం రెండు వందల కోట్ల బడ్జెట్ కు వెనుకాడటం లేదు. మొత్తానికి ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం రావాల్సిన సైరా ఇప్పుడు ఊపిరి పోసుకుంటోంది. దేనికైనా టైం రావాలి అనేది ఇందుకే.