రచయిత గానీ దర్శకుడు గానీ స్టొరీ తయారు చేసుకున్నప్పుడు ఒక హీరోను దృష్టిలో పెట్టుకుంటారు. కానీ ఆ స్టొరీ ఆ హీరోనే చేస్తాడనే గ్యారెంటీ ఉండదు. హీరోకు నచ్చకపోవడం... ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడం లాంటి కారణాలు చాలానే ఉంటాయి కాబట్టి అదేమీ ఇండస్ట్రీలో వింతేమీ కాదు. నాగ శౌర్య తాజా చిత్రం '@నర్తనశాల' కు అదేవిధంగా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందట.
'@నర్తనశాల' దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి మొదటగా ఈ కథ రాసుకున్నప్పుడు హీరో వేణు తొట్టెంపూడి కి వినిపించాడట. స్టోరీ వేణు కి నచ్చినా ఎందుకో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. దీంతో శ్రీనివాస్ చక్రవర్తి కథకు యంగ్ హీరో లకు సూటయ్యేలా కొద్ది మార్పుచేర్పులు చేసి నాగ శౌర్య ను కలిశాడట. 'ఛలో' తర్వాత ఏదైనా డిఫరెంట్ స్టోరీ చేయాలనే ఆలోచనలో ఉన్న శౌర్య కు ఈ గే షేడ్స్ ఉన్న కథ వెంటనే కనెక్ట్ అయిందట. దీంతో సినిమాకు నటించడమే కాకుండా హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై నిర్మించేందుకు ముందుకొచ్చాడు.
కథ మీద నమ్మకంతో తన మార్కెట్ కంటే ఎక్కువగా 15 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడానికి కారణం కూడా అదేనట. ఈ సినిమా ఆగస్ట్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మోడరన్ బృహన్నల సోషల్ మీడియా జెనరేషన్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో వేచి చూడాలి.