సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి గొప్పగా చెప్పే పాయింట్స్ లో ఆయన ఒక్క యాడ్ కూడా చేయకపోవడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే.. ఆయన నేరుగా యాడ్స్ చేయకపోయినా.. దర్శక నిర్మాతలు మాత్రం రజినీ క్రేజ్ ను వాడేసుకుంటున్నారు. కబాలి విషయంలో మాత్రం జరిగింది వేరే. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని బ్రాండ్ ప్రమోషన్ పేరుతో పబ్లిసిటీ చేసేశారు.
ఎయిరేషియా లాంటి విమానయాన సంస్థతో మొదలుపెట్టి.. ఇప్పుడు ఫెయిర్ నెస్ క్రీమ్ వరకూ వచ్చేశారు. కబాలి పేరుతో ఇప్పుడు ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కూడా యాడ్స్ ఇచ్చేస్తోంది. పైన రజినీ బొమ్మ.. పోస్టర్ లో ఫెయిర్నెస్ క్రీమ్. రెండింటికీ లింక్ లేకపోయినా.. ఇది మాత్రం కచ్చితంగా యాడ్ అనే చెప్పాలి. అయితే.. ఇది నిర్మాత డబ్బులు చేసుకునేందుకు అనుసరించే వ్యూహం. పైగా రజినీకాంత్ నల్లగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇప్పుడు రజినీ ఫోటో వేసి ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ ఇవ్వడం అంటే.. ఖచ్చితంగా అభ్యంతర పెట్టాల్సిన అంశం.
గతంలో శివాజి సినిమాలో కూడా తెల్లగా మారేందుకు అంటూ ఫెయిర్ నెస్ క్రీమ్ కి.. రజినీతో బ్రాండ్ ప్రమోషన్ చేయించారు. నలుపు అనే కలర్ ని పాయింట్ ని చూపిస్తూ.. ఇలా ఫెయిర్నెస్ క్రీమ్స్ యాడ్స్ ఇవ్వడం ఆలోచించించాల్సిన విషయం. నల్లగా ఉండడాన్ని తప్పు పట్టేలా ఉంటున్న ఇలాంటి వాటిపై సూపర్ స్టార్ కూడా కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.