ప్రముఖ హాలీవుడ్ దంపతులు కిమ్ కర్దాషియాన్, కాన్యే వెస్ట్ విడాకులు తీసుకోబోతున్నారట! కొంత కాలంగా కొనసాగుతున్న ఊహాగానాలు.. త్వరలో నిజం కాబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం విడివిడిగానే జీవిస్తున్న ఈ ఇద్దరూ.. విడిపోవడం దాదాపు ఖాయమని అమెరికన్ మీడియా వెల్లడించింది.
వేరుగా ఉంటున్న కిమ్..
దంపతుల్లో నటి కిమ్ కర్దాషియాన్ విడాకుల విషయంలో సీరియస్ గా ఉందని సమాచారం. ఇప్పటికే భర్త కాన్యే వెస్ట్ నుంచి వేరుపడిన కిమ్.. తన నలుగురు పిల్లల్ని తీసుకొని లాస్ ఎంజెలెస్లోని తన నివాసానికి వెళ్లిపోయింది. కాన్యే వెస్ట్ ప్రస్తుతం వోమింగ్లో ఒంటరిగా ఉంటున్నారు. వారి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో డివోర్స్ తథ్యం అని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఏడేళ్ల దాంపత్యం..
హాలీవుడ్ హీరోయిన్ కిమ్.. అమెరికన్ రాపర్ కాన్యే ఒక్కటై దాదాపు ఏడేళ్లు గడిచాయి. వీరిద్దరూ 2014లో వివాహం చేసుకొన్నారు. వీరికి మొత్తం నలుగురు పిల్లలు. అయితే.. కాల క్రమంలో వీరిద్దరి మధ్య పొడచూసిన విభేదాలు ప్రస్తుతం పరిష్కరించుకోలేనంతగా ముదిరిపోవడంతో ఏడేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకడమే మేలని భావిస్తున్నట్టు సమాచారం.
వివాదం పెంచిన అమెరికా ఎన్నికలు..
కిమ్-కాన్యే మధ్య వివాదానికి ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా తాను పోటీ చేస్తున్నట్టు ట్విటర్ వేదికగా కాన్యే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో తెలియదు కానీ.. భార్యాభర్తల మధ్య విభేదాలకు ఈ ఎన్నికలే కారణమని ప్రచారం జరుగుతోంది.
అయితే.. విడాకుల విషయంలో భర్త కాన్యే వెస్ట్ తీవ్ర తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వోమింగ్లో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఆయన.. తన లైఫ్ గురించి ఆలోచిస్తున్నారని, ఇప్పటికిప్పుడు తీవ్రమైన నిర్ణయాలు తీసుకొనే ఆలోచనలో లేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి, ఏం జరుగుతుంది? కిమ్-కాన్యే బంధం కొనసాగుతుందా? ముగిసిపోతుందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.