రౌడీ ఊరుకున్నా శర్వా ఊరుకోలేదు!

Update: 2019-08-05 14:32 GMT
కొన్ని రోజుల క్రితం 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రం పబ్లిక్‌ ఈవెంట్‌ లో ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకుని వచ్చి విజయ్‌ దేవరకొండ కాళ్లను అమాంతం పట్టేసుకున్నాడు. ఒక్కసారిగా అభిమాని దూసుకు వచ్చి కాళ్లు పట్టుకోవడంతో విజయ్‌ దేవరకొండ కింద పడబోయాడు. ఆ విషయాన్ని విజయ్‌ దేవరకొండ లైట్‌ గానే తీసుకున్నాడు. ఆ అభిమానిని అక్కడ నుండి తీసుకు వెళ్లడం జరిగింది. అదో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అది మర్చి పోకుండానే తాజాగా 'రణరంగం' చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల వేడుకలో శర్వా మాట్లాడుతున్న సమయంలో కూడా అచ్చు అలాగే జరిగింది.

ఒక అభిమాని హఠాత్తుగా వచ్చి శర్వానంద్‌ కాళ్లు పట్టుకోవడంతో శర్వా కూడా ఒకింత షాక్‌ కు గురయ్యాడు. అభిమాని కాళ్లు పట్టుకోవడంపై శర్వానంద్‌ సీరియస్‌ అయ్యాడు. ఇది మరీ ఎంబరాసింగ్‌ గా ఉంది. అభిమానులు పడాల్సింది హీరోల కాళ్లమీద కాదని వారి తల్లిదండ్రుల కాళ్ల మీద అన్నాడు. ఈమద్య కాలంలో ఇలా వరుసగా ఎందుకు జరుగుతుందో అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇలా ముందు ముందు జరగకూడదని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

పబ్లిక్‌ వేడుకల్లో భాగంగా ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. స్టార్‌ హీరోల వద్ద వచ్చి వారిని హగ్‌ చేసుకోవడం వారి చేతులు పట్టుకునేందుకు ప్రయత్నించడం కాళ్లు పట్టుకోవడం చేస్తూనే ఉంటున్నారు. గతంలో పలువురు స్టార్‌ హీరోలు ఇలాంటి అనుభవంను ఎదుర్కొన్నారు. అయితే యంగ్‌ హీరోలకు ఇలాంటి అనుభవం చాలా తక్కువ అని చెప్పాలి. కాని బ్యాక్‌ టు బ్యాక్‌ విజయ్‌ దేవరకొండ మరియు శర్వానంద్‌ లు ఇలాంటి అనుభవాలు ఎదుర్కోవడం జరిగింది. ఈ విషయమై విజయ్‌ దేవరకొండ లైట్‌ తీసుకున్నా శర్వానంద్‌ మాత్రం సీరియస్‌ అయ్యి మళ్లీ ఇలాంటివి జరగవద్దని హెచ్చరించాడు.

Tags:    

Similar News