తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీగా మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో నందమూరి బాలకృష్ణ ఒకరు. సీనియర్ స్టార్ అయినప్పటికీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఒక్కోసారి అభిమానులు ఆయనపై చూపించే అభిమానం హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. గతంలో జై బాలయ్య అని పచ్చబొట్లు పొడిపించుకోవడం ఒక ట్రెండ్ గా ఉండేది. తాజాగా ఒక అభిమాని విభిన్న తరహాలో బాలయ్యపై అభిమానాన్ని ప్రదర్శించాడు.
కర్ణాటకకు చెందిన బాలయ్య అభిమాని శ్రీనివాసులు తన కుమారుడి పెళ్ళి సందర్భంగా బాలయ్యపై తన ఇష్టాన్ని శుభలేఖలపై అచ్చు వేయించడం ద్వారా చాటాడు. శుభలేఖ కవర్ పై భాగంలో సహజంగా చాలామంది దేవుని ఫోటో ఉండేలా డిజైన్ చేయించుకుంటారు. కానీ ఈ అభిమాని దేవుడి ఫోటోకు బదులుగా బాలయ్య ఫోటోను ముద్రించాడు. ఇక శుభలేఖ లోపల వెంకటేశ్వర స్వామి గెటప్ లో ఉన్న బాలయ్య ఫోటోను ముద్రించారు.
అంతే కాదు మే 13న తన కుమారుడి వివాహానికి నందమూరి అభిమానులంతా ఆహ్వానితులే అంటూ శ్రీనివాసులు ఇన్విటేషన్లో ముద్రించడం అయన బంధువర్గాలలోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయింది. ఇక చెప్పేదేముంది.. ఈ శుభలేఖ ప్రస్తుతం వైరల్ గా మారింది. బాలయ్య ఫ్యాన్స్ ఈ శుభలేఖను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను.. బోయపాటి శ్రీనుతో మరో సినిమాను చేయబోతున్నారు.