ట్రైలర్ టాక్: ఐష్-అనిల్ చితకొట్టారు

Update: 2018-07-06 13:27 GMT
అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకున్నాక చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న ఐశ్వర్య రాయ్ కొంత గ్యాప్ తర్వాత నటించిన మూవీ ఫన్నే ఖాన్. అనిల్ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో న్యూటన్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ రావు ఐష్ తో పాటు కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అరటిపండు ఒలిచినట్టు కథ మొత్తం ట్రైలర్ లో చూపించారు.

1990 టైంలో యువకుడిగా ఉన్న ఫన్నే ఖాన్(అనిల్ కపూర్) పాప్ సింగర్ కావాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకోలేక టాక్సీ డ్రైవర్ గా స్థిరపడి పోతాడు. కానీ తన కూతురు లతా శర్మ(పిహు సంధ్) ద్వారా ఆ కోరిక తీర్చుకోవాలని డిసైడ్ అయిపోతాడు.  భార్య కవితా శర్మ(దివ్యా దత్తా) వద్దని వారిస్తున్నా కూతురి ద్వారా  ప్రయత్నాలు మొదలుపెడతాడు. కానీ భారీ ఊబకాయం ఉన్న లతా శర్మకు అవకాశాల కంటే అవమానాలు ఎక్కువవుతాయి. పాప్ ఆల్బం చేయాలంటే డబ్బు కావాలని గుర్తించిన ఫన్నే ఖాన్ స్నేహితుడు ఆధిర్(రాజ్ కుమార్ రావు) ద్వారా పాప్ సింగర్ బేబీ సింగ్(ఐశ్వర్య రాయ్) ని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య లతా శర్మ తన టాలెంట్ ని ప్రపంచానికి చాటు చెబుతుంది. ఇది సాధించడానికి ఆ తండ్రి పడ్డ సంఘర్షణ చేసిన పోరాటమే ఫన్నే ఖాన్.

ఈ మధ్య వయసు మళ్ళిన పాత్రలను అద్భుతంగా పోషిస్తున్న అనిల్ కపూర్ మరోసారి దీంట్లో హై లైట్ గా నిలుస్తున్నాడు. కన్న కూతురిని అందరు గేలి చేస్తున్నా నెరవకుండా ఎదురీదే పాత్రలో జీవించేసాడు. కథలో దంగల్ -సీక్రెట్ సూపర్ స్టార్ ఛాయలు చాలానే ఉన్నప్పటికీ ఐశ్వర్య రాయ్ ఉండటం చాలా మటుకు కవర్ చేసింది. ఇంత వయసు వచ్చినా చెక్కుచెదరని గ్లామర్ తో ఐష్ మరోసారి మేజిక్ చేసినట్టే కనిపిస్తోంది. ఎమోషన్స్ ని పండించడంలో దర్శకుడు అతుల్ మంజ్రేకర్ మంచి హోమ్ వర్క్ చేసాడు. ఆగష్టు 3న విడుదల కానున్న ఫన్నే సింగ్ ఒరిజినల్ బయోపిక్ కాదు కానీ డ్రామా ఉన్న ఎమోషనల్ మిడిల్ క్లాస్ డ్రామాగా అంచనాలు రేపుతోంది. సంజు తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో భారీ తారాగణంతో వస్తున్న సినిమా ఫన్నే ఖానే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ సెట్ చేస్తుందో చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News