చరణ్ అన్నా.. ఆర్‌సీ15 అప్డేట్‌ ప్లీజ్‌

Update: 2022-11-12 12:30 GMT
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన చిత్రీకరణ వరుస షెడ్యూల్ లో జరుగుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ను దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక ఫస్ట్‌ లుక్ కానీ.. టైటిల్ లోగో కానీ.. కనీసం వర్కింగ్ స్టిల్స్ కానీ బయటకు వచ్చిందే లేదు.

సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ లీక్ అవ్వడం వల్ల సినిమా లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అంటూ క్లారిటీ వచ్చింది. అంతే కాకుండా రామ్‌ చరణ్ పోషిస్తున్న తండ్రి పాత్రకు అంజలి జంటగా నటిస్తున్నట్లుగా కూడా ఇటీవల లీక్ అయిన స్టిల్స్ ను బట్టి అర్థం అవుతుంది. కానీ ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్డేట్‌ అయితే లేదు.

ఈ సినిమా లో హీరోయిన్ గా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆమెకు సంబంధించిన లుక్‌ మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మొత్తానికి ఈ సినిమా యొక్క షూటింగ్‌ కార్యక్రమాలు చకచక జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు అప్‌డేట్‌ లేకపోడం పట్ల మెగా ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాను సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమా అప్‌డేట్ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ మొదలు పెట్టారు. చరణ్ అన్నా మన ఆర్‌ సీ 15 సినిమా యొక్క అప్‌డేట్‌ ఎప్పుడూ అంటూ చాలా మంది ఈ సందర్భంగా ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. దిల్‌ రాజు టీం నుండి ఈ ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.

రామ్‌ చరణ్ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కనుక ఈ సినిమా ను ఆ స్థాయిలో ఉండేలా తెరకెక్కిస్తున్నట్లుగా దిల్ రాజు టీమ్ చెప్పుకొచ్చింది. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళంలో ఏక కాలంలో రూపొందుతోంది. అంతే కాకుండా ఒకే సారి ఈ సినిమాను సౌత్‌ లో అన్ని భాషల్లో మరియు హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News