ఆదిపురుష్‌ లీక్ వీడియో పై ఫ్యాన్స్‌ కామెంట్స్‌

Update: 2022-01-31 07:39 GMT
ప్రభాస్‌ మొదటి బాలీవుడ్‌ మూవీ ఆదిపురుష్‌ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. ఇండియాస్ బిగ్గెస్ట్‌ మోషన్ గ్రాఫిక్స్ మూవీగా ఆదిపురుష్ నిలువబోతుంది. మోషన్‌ గ్రాఫిక్స్ లో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి మెయిన్ లీడ్ పాత్రలను విజువల్ వండర్ గా దర్శకుడు ఓమ్ రౌత్‌ ఆవిష్కరించబోతున్నట్లుగా తెలుస్తోంది. పలు దేశాల్లో చాలా కంపెనీలు ప్రస్తుతం ఆదిపురుష్‌ వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ను చేస్తున్నాయి.

సహజంగా ఇంత మంది వర్క్ లో భాగస్వామ్యం అయిన సందర్బంలో ఎక్కడో ఒక చోట ఫుటేజ్ లీక్ అవ్వడం చాలా కామన్ విషయం. ఇన్నాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎక్కడ కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. కాని తాజాగా ప్రభాస్ ఆదిపురుష్‌ షాట్స్ లీక్‌ అయ్యాయి. వీఎఫ్‌ఎక్స్ షాట్స్ లీక్ అవ్వడంతో వెంటనే యూనిట్‌ సభ్యులు రంగంలోకి దిగి వాటిని సోషల్‌ మీడియా లో లేకుండా డిలీట్‌ చేసే ప్రయత్నం చేశారు.

ఆ మద్య ఆర్ ఆర్‌ ఆర్ సినిమా నుండి ఎన్టీఆర్‌ పులి తో ఫైట్‌ చేసే షాట్స్ కూడా లీక్ అయ్యాయి. ఆ షాట్స్ తో సినిమా పై అంచనాలు ఎంతగా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆది పురుష్ నుండి ప్రభాస్ విజువల్స్ లీక్ అవ్వడం తో కూడా సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు రాముడి పాత్రలో ప్రభాస్ లుక్ ను ఆదిపురుష్ టీమ్‌ రివీల్‌ చేయలేదు. ఎట్టకేలకు ఈ లీక్‌ అయిన ఫుటేజ్ తో రాముడి గా ప్రభాస్‌ ను చూడటం సంతోషంగా ఉందని.. ఆయన అద్భుతంగా ఆరు అడుగుల ఆజానుబాహుడి మాదిరిగా రాముడిగా కనిపిస్తున్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో ఫుటేజ్ ను ఎక్కువ షేర్‌ చేయకుండా ఎక్కడికి అక్కడ అభిమానులు కూడా డిలీట్ చేస్తూ వచ్చారు. తద్వార లీక్ అయిన కొన్ని గంటల్లోనే సోషల్‌ మీడియాలో ఎక్కడ కనిపించకుండా చేయగలిగారు. కాని కొందరు మాత్రం ఇంకా స్క్రీన్‌ షాట్స్ ను షేర్‌ చేస్తున్నారు. అందులో ప్రభాస్ గెటప్ సరిగా కనిపించడం లేదు. అయినా కూడా దాన్ని కొందరు తెగ షేర్‌ చేస్తున్నారు. మొత్తానికి ఆదిపురుష్‌ అఫిషియల్‌ ఫస్ట్ లుక్‌ కోసం మరింత ఎక్కువ డిమాండ్‌ పెరిగేలా ఆ లీక్ అయిన ఫుటేజ్ చేసింది అనడంలో సందేహం లేదు.

ప్రభాస్ ను ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా చూశాం. బాహుబలి సినిమా తో పౌరాణికం పాత్రలో కూడా చూశాం. కాని రాముడి పాత్రలో ప్రభాస్ ను ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది. అలా ఉంటాడా.. ఇలా ఉంటాడా అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పాన్ ఇండియా సూపర్ స్టార్‌ గా పేరు దక్కించుకున్న ప్రభాస్‌ ను రాముడిగా చూసేందుకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. వరుస సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద ఫైట్‌ కు సిద్దం అవుతున్న ప్రభాస్ ఈ సినిమా తో పాన్‌ వరల్డ్‌ స్టార్‌ గా మారే అవకాశం ఉంది. ఇండియన్ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో కూడా ఆదిపురుష్ ను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. నాలుగు వందల కోట్ల బడ్జెట్‌ తో రూపొందుతున్న ఆదిపురుష్ వెయ్యి కోట్ల ప్రాఫిట్స్ ను తీసుకు వస్తుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News