అభిమానులారా మీలో మీరు గొడవ పడకండి.. ఫ్యాన్ వార్స్ వద్దు.. నేను చాలా హర్టయ్యాను.. మెగా ఫ్యామిలీలో అందరూ బాధపడ్డారు.. దయచేసి ఇలాంటివి నివారించండి.. అంటూ ఓ పక్క అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తుంటే.. మరోవైపు అతడి ఎదురుగానే బాహాబాహీకి దిగారు మెగా అభిమానులు.
బన్నీ తన స్పీచ్ ద్వారా మెగా అభిమానుల్లో ఉన్న అంతర్గత విభేదాలు సమసిపోయేలా చేయడానికి తన వంతుగా ఎంత ప్రయత్నం చేసినా.. కొందరు అభిమానులు మాత్రం అతడి మాటలకు విలువ లేకుండా చేశారు. అనుకున్నట్లే ‘ఒక మనసు’ ఆడియో వేడుకకు పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తునే హాజరయ్యారు. పవర్ స్టార్ పేరు చెప్పినపుడు వచ్చిన హర్షాతిరేకాల్ని బట్టే పవన్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఈ వేడుకకు వచ్చారో అర్థమైపోతుంది. మరోవైపు అల్లు అర్జున్ ఎక్స్ క్లూజివ్ ఫ్యాన్స్ కూడా ఓ మోస్తరుగానే హాజరయ్యారు. ఆన్ లైన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో బేనర్లు కూడా ప్రదర్శించారు.
ఐతే బన్నీ మాట్లాడుతున్న సమయంలో ఈ రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. మొదట వాగ్వాదాలతో మొదలైన గొడవ.. తర్వాత బాహాబాహీకి దిగే వరకు వెళ్లింది. ఓ పక్క బన్నీ తన పాటికి తాను మాట్లాడుతూ పోతుంటే ఈ అభిమానులు పరస్పరం దాడులకు దిగారు. ఒకరిపై ఒకరు పంచ్ లు విసురుకున్నారు. కాసేపటి తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది. బన్నీ అంత చెప్పినా అభిమానులు ఇలా చేయడం పట్ల వేడుకకు హాజరైన వారిని విస్తుపోయేలా చేసింది.