#RRR టీమ్ కి నెటిజ‌నుల అక్షింత‌లు

Update: 2020-01-02 05:50 GMT
2020 ట్రీట్ అంటూ ఊరించిన జ‌క్క‌న్న‌కు ఊహించ‌ని కోటింగ్ ఇది. నిన్న‌టి రోజున ఆర్.ఆర్.ఆర్ ట్రీట్ అంటూ పాత పోస్ట‌ర్ నే కొత్త‌గా వేయ‌డంపై ఆన్ లైన్ మీమ్స్ వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. నేరుగా అభిమానులే ఎవ‌రికి న‌చ్చిన మీమ్స్ వాళ్లు పోస్ట్ చేసి ఆర్.ఆర్.ఆర్ యూనిట్ కి రివ‌ర్స్ కోటింగ్ ఇచ్చారు. పాత పోస్ట‌ర్ పై కొత్త రంగులేసి హ్యాపీ న్యూ ఇయ‌ర్ చెబుతారా? అంటూ ఓ రేంజ్ లో మీమ్స్ తో రచ్చ చేసారు. తెలివితేట‌లు మీకే నా..  మాకు లేవా? అంటూ  ఆర్.ఆర్.ఆర్ ప్ర‌మోష‌న‌ల్ టీమ్ కి గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు. ఒక్క కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేసినందుకే ఇన్ని అప‌వాదులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. క‌నీసం ఆ చెత్త‌ పోస్ట‌ర్ రిలీజ్ చేయకుండా ఉంటే ప‌రువైనా ద‌క్కేది!! అంటూ సెటైర్లు గుప్పించారు నెటిజ‌నం.

ఆ విష‌యాలు ప‌క్క‌న‌బెడితే  ఆర్.ఆర్.ఆర్ టీమ్ చేసిన ఈ పనికి నిజ‌మైన అభిమానులు మాత్రం తీవ్రంగా హ‌ర్ట‌య్యారని స‌మాచారం. ఏ హీరో సినిమా అయినా విజ‌యం సాధించాలంటే అభిమానులు కీల‌కం. అభిమానులు లేనిదే సినిమాల్లేవ్. హీరోలు లేన‌ట్టేన‌న్న‌ది వాస్త‌వం. ఈ విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు  అగ్ర హీరోలంతా ప్ర‌చార‌ వేదిక‌ల‌పై గుర్తు చేస్తూనే  ఉంటారు. మ‌రి ఇవేవీ రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్- రాజ‌మౌళి బృందానికి గుర్తు లేవా? అంటూ కొంద‌రు సోష‌ల్ మీడియా  వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్నారు. అభిమానులంటే మ‌రీ అంత చుల‌క‌న‌గా క‌న‌బ‌డుతున్నారా? అని మండిప‌డుతున్నారు.

ఎంత అన్యాయం కాక‌పోతే పాత పోస్ట‌ర్ కి కొత్త రంగులేసి న్యూ పోస్ట‌ర్ అంటారు? ఆ మాత్రం త‌ల‌కాయ‌లు మాకు లేవా? అంటూ భ‌గ్గుమంటున్నారు. ఇది నిజంగా షేమ్ యాక్ట్ అంటూ ఆర్‌.ఆర్.ఆర్ టీమ్ కి త‌లంట‌డ‌మేనంటూ నెటిజ‌నులు కామెంట్లు పెడుతున్నారు. మ‌రి నిన్న వ‌చ్చిన కామెంట్ల‌పై యూనిట్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్ప‌టివ‌ర‌కూ అయితే ఎలాంటి రెస్సాన్స్ లేదు. కానీ వివ‌ర‌ణ ఇవ్వాల్సిన బాధ్య‌త మాత్రం యూనిట్ పై ఉంద‌ని ప‌లువురి అభిప్రాయం. ఇక అయిన దానికి కాని దానికి ట్వీట్లు చేసే డీవీవీ మీడియా ఈ ఘాటైన కామెంట్ల‌కు ఏం స‌మాధానం ఇస్తుందో చూడాలి.


Tags:    

Similar News