పుష్ప‌రాజ్ కోసం ఫ్యాన్స్ వేయిటింగ్ ఇక్క‌డ‌!

Update: 2023-01-04 06:38 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా వండ‌ర్ 'పుష్ప‌'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ మూవీ ప్ర‌పంచ‌ వ్యాప్తంగా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 'పుష్ప‌' సాంగ్స్‌, బ‌న్నీ మేన‌రిజ‌మ్స్‌, హుక్ స్టెప్స్‌, శ్రీ‌వ‌ల్లి సిగ్నేచ‌ర్ స్టెప్స్, ట్రెండీ డైలాగ్స్ సినిమాని మ‌రింతగా వైర‌ల్ అయ్యేలా చేశాయి.

దీంతో సినిమా పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచి సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. బ‌న్నీ కెరీర్ లోనూ అనూహ్యంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 300 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త రికార్డుని సృష్టించింది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించిన ఈ మూవీ విడుద‌లై ఏడాది పూర్తి కావ‌స్తోంది. ఈ మూవీ త‌రువాత దీనికి సీక్వెల్ గా 'పుష్ప ది రూల్'ని తెర‌కెక్కిస్తున్నారు. డిఫ‌రెంట్ మేన‌రిజ‌మ్స్‌, స‌రికొత్త మేకోవ‌ర్ తో బ‌న్నీ క‌నిపించ‌నున్న ఈ సీక్వెల్ ని ఫ‌స్ట్ పార్ట్ కు పూర్తి భిన్నంగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇందు కోసం మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు రూ. 350 కోట్ల‌కు పైగా ఖర్చు చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఎట్ట‌కేల‌కు ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. కేవ‌లం ఐదు రోజులు మాత్ర‌మే షూటింగ్ చేసిన సుకుమార్ ఆ త‌రువాత బ్రేకిచ్చారు.

మ‌ళ్లీ ఎప్పుడు మొద‌ల‌వుతుందా?.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్ లో ఆందోళ‌న మొద‌లైంది. టీమ్ చాలా కూల్ గా వుండ‌టంతో మ‌ళ్లీ షూటింగ్ ఎప్పుడు మొద‌లు కానుందా? అని ఫ్యాన్స్ ఆరాతీయ‌డం మొద‌లు పెట్టారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం తదుప‌రి షెడ్యూల్ ని జ‌న‌వ‌రి 7 నుంచి మొద‌లు పెట్టే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్ లో ప్ర‌త్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ ప్రారంభం కానుంద‌ట‌. ఇందులో అల్లు అర్జున్ కూడా పాల్గొన‌బోతున్నాడ‌ని, త్వ‌ర‌లోనే చిత్ర బృందం అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఫ‌హ‌ద్ ఫాజిల్‌, సునీల్‌, అన‌సూయ, క‌న్న‌డ న‌టుడు ధ‌నుంజ‌య‌ తో పాటు ప‌లువురు క్రేజీ న‌టులు పార్ట్  2 లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News