సూపర్ స్టార్ కు ప్రేమతో.. లేఖలతో అభిమానులు

Update: 2020-11-03 07:10 GMT
‘ఓ రైలు జీవితం కాలం లేటు’ అన్న సామెత ఎంత పాపులరో.. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లో రావడం అనేది కూడా అంతే హాట్ టాపిక్. ఎప్పుడో రాజకీయాల్లోకి వస్తానన్న తమిళ అగ్రహీరో, సూపర్ స్టార్ రజినీకాంత్.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా ఉలుకు లేదు పలుకు లేదు. 15 ఏళ్లుగా రాజకీయాల్లో రజినీ వస్తాడు.. మా కోరిక తీరుస్తాడనుకుంటున్న అభిమానుల ఆశలు నెరవేరడం లేదు.

ఇటీవల తాను రాజకీయాల్లోకి రాలేనంటూ రజినీకాంత్ పేరుతో వెలువడిన ఒక లెటర్ వైరల్ అయ్యింది. దీనిపై వివరణ ఇచ్చిన రజినీకాంత్.. ఆ లెటర్ నాది కాదని స్పష్టం చేశారు.అయితే తన ఆరోగ్యానికి సంబంధించి అందులో ఉన్న సారాంశం మాత్రం వాస్తవం అని బాంబు పేల్చారు.

దీంతో రజినీకాంత్ కు కిడ్నీ మార్పడి జరిగిందనే విషయం అభిమానులతోపాటు పలువురు ప్రముఖులకు కూడా షాకిచ్చింది. కిడ్నీ మార్పడి అనేది చాలా క్లిష్టమైన సమస్య. అది చేసుకుంటే బయట ఏం పనిచేయడానికి ఉండదు. సరిగ్గా సెట్ కాకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇప్పటికే సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లాంటి వారు కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే రజినీకాంత్ రిస్క్ చేసి ఇప్పుడు రాజకీయాల్లోకి రావద్దనే డిమాండ్ పెరిగిపోయింది.

అయితే రజినీకాంత్ అభిమానులు మాత్రం తమ సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని ఉద్యమం మొదలుపెట్టారు. రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టాలని.. బహిరంగ సభలు పెట్టకపోయినా మీడియాను వాడుకొని వర్చువల్ మీటింగ్స్ ద్వారా ప్రచారం నిర్వహించాలని.. అలా చేసినా తాము ఆదరిస్తామని అంటున్నారు.

ఈ మేరకు రజినీ ఫ్యాన్స్ తాజాగా ఆయనను ఒప్పించడానికి ఒక మార్గం కనుగొన్నారు. అందరూ కలిసి రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఆయన నివాసానికి భారీ ఎత్తున ఉత్తరాలు రాయాలని అనుకుంటున్నారట..

మరి ఈ ఉత్తరాల రాయబారం అయినా సూపర్ స్టార్ మనుసును మారుస్తుందా? లేదా అన్నది వేచిచూడాలి. ఆరోగ్యరీత్యానే రజినీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News