యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''థ్యాంక్యూ''. ఇందులో రాశి ఖన్నా - అవికా గోర్ - మాళవిక నాయర్ వంటి ముగ్గురు హీరోయిన్లు నటించారు. రిలీజ్ కు రెడీ అవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇప్పటికే 'థాంక్యూ' సినిమా ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలానే 'మారో మారో' మరియు 'ఏంటో ఏంటేంటో' అనే రెండు పాటలను కూడా వదిలారు. ఇవి రెండూ శ్రోతలను ఆకట్టుకున్నాయి కానీ.. సినిమాకు ఆశించిన బజ్ అయితే తీసుకురాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా సినిమాలోని 'ఫేర్ వెల్' సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ రోజు సోమవారం జరిగిన లాంచ్ ఈవెంట్ లో హృదయానికి హత్తుకునే ఈ గీతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినిమా మేకర్స్ - ప్రధాన నటీనటులు మరియు టీమ్ అందరూ హాజరయ్యారు.
'అమ్మా నాన్నతో ఓ ఐదేళ్లు.. గల్లీ గ్యాంగ్ తో ఓ ఐదేళ్లు.. హైస్కూల్ మేట్స్ తో ఇంకో ఐదేళ్లు.. ఈ కాలేజ్ బ్యాచ్ తో ఐదేళ్లు..' అంటూ సాగిన ఈ హృదయపూర్వకమైన గీతం ఆకట్టుకుంటోంది. ప్రతి ఒక్కరి కాలేజ్ డేస్ జ్ఞాపకాలు - ఫేర్ వెల్ పార్టీలను గుర్తు చేసి భావోద్వేగానికి లోనయ్యేలా చేస్తోంది.
ఎస్ఎస్ థమన్ బ్యూటీఫుల్ ట్యూన్ సమకూర్చగా.. గీత రచయిత చంద్రబోస్ మనసును హత్తుకునే సాహిత్యం అందించారు. యువ గాయకుడు అర్మాన్ మాలిక్ అద్భుతంగా ఆలపించారు. శేఖర్ మాస్టర్ 'ఫేర్ వెల్' సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు.
'థాంక్యూ' చిత్రాన్ని ముందుగా జులై 8న రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఇటీవల విడుదలను జూలై 22 కి వాయిదా వేశారు. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకి బీవీఎస్ రవి కథ అందించారు. దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తుండగా.. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లెజండరీ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.Full View
ఇప్పటికే 'థాంక్యూ' సినిమా ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలానే 'మారో మారో' మరియు 'ఏంటో ఏంటేంటో' అనే రెండు పాటలను కూడా వదిలారు. ఇవి రెండూ శ్రోతలను ఆకట్టుకున్నాయి కానీ.. సినిమాకు ఆశించిన బజ్ అయితే తీసుకురాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా సినిమాలోని 'ఫేర్ వెల్' సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ రోజు సోమవారం జరిగిన లాంచ్ ఈవెంట్ లో హృదయానికి హత్తుకునే ఈ గీతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినిమా మేకర్స్ - ప్రధాన నటీనటులు మరియు టీమ్ అందరూ హాజరయ్యారు.
'అమ్మా నాన్నతో ఓ ఐదేళ్లు.. గల్లీ గ్యాంగ్ తో ఓ ఐదేళ్లు.. హైస్కూల్ మేట్స్ తో ఇంకో ఐదేళ్లు.. ఈ కాలేజ్ బ్యాచ్ తో ఐదేళ్లు..' అంటూ సాగిన ఈ హృదయపూర్వకమైన గీతం ఆకట్టుకుంటోంది. ప్రతి ఒక్కరి కాలేజ్ డేస్ జ్ఞాపకాలు - ఫేర్ వెల్ పార్టీలను గుర్తు చేసి భావోద్వేగానికి లోనయ్యేలా చేస్తోంది.
ఎస్ఎస్ థమన్ బ్యూటీఫుల్ ట్యూన్ సమకూర్చగా.. గీత రచయిత చంద్రబోస్ మనసును హత్తుకునే సాహిత్యం అందించారు. యువ గాయకుడు అర్మాన్ మాలిక్ అద్భుతంగా ఆలపించారు. శేఖర్ మాస్టర్ 'ఫేర్ వెల్' సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు.
'థాంక్యూ' చిత్రాన్ని ముందుగా జులై 8న రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఇటీవల విడుదలను జూలై 22 కి వాయిదా వేశారు. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకి బీవీఎస్ రవి కథ అందించారు. దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తుండగా.. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లెజండరీ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.