మహేష్ ఫాన్స్ వీ లవ్ యు అనేసారు

Update: 2018-04-04 07:19 GMT
టాలీవుడ్ మార్కెట్ పరిధి విస్తృతంగా పెరిగాక వారు వీరు అనే తేడా లేకుండా బాలీవుడ్ నుంచి ప్రముఖులు సైతం తెలుగు సినిమాల్లో నటించేందుకు పని చేసేందుకు బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది బాహుబలి నుంచి బాగా వ్యాప్తి చెందింది. ముఖ్యంగా తెలుగు ఆల్బమ్స్ లో పాడేందుకు అక్కడి సింగర్స్ ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా. మహేష్ బాబు ప్రెస్టీజీయస్ మూవీ భరత్ అనే నేనులో ఐ డోంట్ నో పాట కోసం సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హింది నటుడు కం దర్శకుడు కం గాయకుడు అయిన ఫర్హాన్ అక్తర్ ని తీసుకొచ్చి పాడించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ పాట వైరల్ అవుతూ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఫర్హాన్ అక్తర్ గొంతు ఎలా ఉంటుందా అని మొదట్లో అనుకున్నారు కాని అతను వావ్ అనిపించాడు.

ఇప్పుడు ఈ ఆనందాన్ని మహేష్ ఫాన్స్ తనతోనే డైరెక్ట్ గా ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. పాట తమకు ఎంత నచ్చిందో మెసేజులు పంపుతూ ఫీడ్ బ్యాక్ ఇచ్చేస్తున్నారు . ఇంత స్పందన ఊహించని ఫర్హాన్ అక్తర్ ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. తెలుగు ఇంగ్లీష్ రెండు పదాలను మిక్స్ చేసి రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఫర్హాన్ గొంతులో బాగా కనెక్ట్ అయ్యాయి. ఇది బిగినింగ్ మాత్రమే అని ముందు ముందు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తే వదులుకోకని మహేష్ అభిమానులు ఫర్హాన్ ని బాగా ఉత్సాహపరుస్తున్నారు.

మహేష్ సినిమాల ద్వారా బాలీవుడ్ సింగర్ పాపులారిటీ తెచ్చుకోవడం కొత్తేమి కాదు. గతంలో శ్రేయ ఘోషల్ ఒక్కడు సినిమాలో 'నువ్వేం మాయ చేసావో గాని' పాట పాడాక దాని దెబ్బకు తెలుగులో వందల సంఖ్యలో పాటలు పాడే అవకాశాలు దక్కించుకుని ఇక్కడి టాప్ సింగర్స్ కు ధీటుగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ అంత పేరు తెచ్చుకుంటాడేమో వేచి చూడాలి.
Tags:    

Similar News