ఫేస్ బుక్ మీద అంతర్జాతీయంగా వెల్లడవుతున్న వ్యతిరేకతలో బాలీవుడ్ నటుడు గళం కలిపాడు. ఫేస్ బుక్ ఖాతాదారుల వ్యక్తిగత డేటా చౌర్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. పలువురు ఫేస్ బుక్ కు గుడ్ బై చెప్పేస్తున్న సంగతి తెలిసిందే.
డేటా చౌర్యంపై ఇప్పటికే సారీ చెప్పారు పేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్. అయినప్పటికీ.. ఒప్పుకోని పలువురు ప్రముఖులు తమ ఫేస్ బుక్ ఖాతాల్ని శాశ్వితంగా డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ జాబితాలో హాలీవుడ్ నటుడు జిమ్ క్యారీ.. సింగర్ కమ్ నటి చెర్ తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. ఇలాంటి వేళ.. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు ఫరాన్ ఆక్తర్ (44) తన ఫేస్ బుక్ ఖాతాను పర్మినెంట్ గా డిలీట్ చేసినట్లు ప్రకటించారు.
ఈ రోజు ట్విట్టర్ లో తాను ఫేస్ బుక్ నుంచి శాశ్వితంగా గుడ్ బై చెప్పినట్లుగా పేర్కొన్నాడు. అయితే.. తాను డిలీట్ చేసిన తర్వాత కూడా తన ఖాతా కొనసాగుతుందన్న ఆరోపణ చేశాడు. ఫరాన్ ఆక్తర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఎఫ్ బీ నుంచి బయటకు వస్తే.. అదో ట్రెండ్ గా మారితే.. ఫేస్ బుక్ కు కొత్త కష్టం మీద పడినట్లు అవుతుందని చెప్పక తప్పదు.