మాస్ రాజా రవితేజ క్రాక్ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా సినిమాలను ఓకే చేసాడు. ప్రస్తుతం వీర ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఖిలాడి సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరిలు కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే మాస్ రాజా సరసన ఈమధ్య కొత్త హీరోయిన్స్ తెగ కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రవితేజ తదుపరి సినిమా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయనున్నాడు. ఖిలాడి షూటింగ్ అయిపోగానే మాస్ రాజా త్రినాథరావు సినిమాలో పాల్గొంటాడు. అయితే ఆ సినిమాకోసం ప్రస్తుతం నటినటుల ఎంపిక జరుగుతుంది.
ఇటీవలే టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది జాతిరత్నాలు సినిమా. ఈ సినిమా ఫస్ట్ నుండి కూడా పాజిటివ్ బజ్ తో విడుదలై సూపర్ హిట్ కొట్టేసింది. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలకపాత్రలు పోషించగా.. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి మరో జాతిరత్నం పరిచయం అయింది. ఆమె హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ఫరియా ఫస్ట్ సినిమాకే మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పుడే ఫరియాకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయని టాక్. తాజా సమాచారం ప్రకారం.. రవితేజ - త్రినాథరావు సినిమాకోసం ఫరియాతో చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే మెయిన్ హీరోయిన్ కోసమేనా లేక వేరే ఏదైనా క్యారెక్టర్ కోసమా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి అసలు నిజం తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే.