దిశా హాట్ పిక్స్ పై డాడీ రియాక్షన్ ఇదే!

Update: 2019-06-06 08:30 GMT
దిశా పటాని పేరు హాట్ నెస్ కు కేరాఫ్ ఆడ్రెస్ గా మారిన సంగతి తెలిసిందే.  పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ ఆమెకు గుర్తింపు ఎక్కువ గా వచ్చింది మాత్రం లో దుస్తుల బ్రాండ్ కాల్విన్ క్లెయిన్ కు ప్రచారం చెయ్యడంతోనే.  ఆ బ్రాండ్ లో దుస్తులను ప్రచారం చెయ్యడం  ద్వారా దిశాలోని గ్లామరస్ అపరిచితురాలు బైటకు వచ్చింది.  అంతకు ముందు ఏదో బీచ్ లో బికినిలో ఫోటో షూట్ లు చేసుకునే అమ్మడు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలకు మోస్ట్ వాంటెడ్ బేబ్ గా.. హాట్ ఫేవరెట్ గా మారింది.  ఆమె ఎప్పుడెప్పుడు కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తుందా అని ఎదురు చూసే నెటిజనులు ఉన్నారనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.

ఇదిలా ఉంటే.. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన సల్మాన్ ఖాన్ సినిమా 'భారత్' లో దిశా పటాని నటించింది. నిన్న రంజాన్ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ లో జోరుగా పాల్గొంటోంది దిశా.  ప్రమోషన్ కార్యక్రమంలో రిపోర్టర్లు దిశాను చాలా ప్రశ్నలే అడిగారు.  అయితే అందరికీ ఆసక్తిని రేకెత్తించిన ప్రశ్న ఇది.. "మీరు రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్లు చేస్తుంటారు కదా.. దీనిపై మీ అమ్మ.. నాన్న స్పందన ఎలా ఉంటుంది?" ప్రశ్నలందు హాటు ప్రశ్నలు వేరయ్యా అన్నట్టు హాటు ప్రశ్న అడిగినా దిశా మాత్రం తొణక్కుండా సమాధానం ఇచ్చింది.

తన కుటుంబ సభ్యులు తనను ఎల్లవేళలా గమనిస్తూ ఉంటారని.. అయితే సినిమా ఇండస్ట్రీ  అంటేనే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇదంతా సహజమని వారు అర్థం చేసుకున్నారని వెల్లడించింది. "నా సెక్సీ ఫోటోలు చూసి నాన్న ఇబ్బంది పడతారు. ఇక అమ్మ మాత్రం ఆ ఫోటోలను చూస్తుందే కానీ ఎవరికీ చూపించదు" అని చెప్పింది. నిజమే.. ఏ తండ్రికైనా అది ఇబ్బందికరమైన పరిస్థితే.  ఇక అమ్మగారు ఆ ఫోటోలను ఎవరికీ చూపించరు అంటోంది సరే.. ఇన్స్టాగ్రాము గారు మాత్రం అలా కాదుగా.. ప్రపంచానికంతా చూపిస్తారు. జనాలు లైకుల మీద లైకులు కొడతారు.

    

Tags:    

Similar News