'చాచి 420' అనే చిత్రంతో బాల నటిగా పరిచయం అయిన ఫాతిమా సన షేక్ చాలా ఏళ్లు హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. 'దంగల్' చిత్రంతో ఎట్టకేలకు ఈ అమ్మడికి ఛాన్స్ దక్కింది. 'దంగల్' చిత్రంలో రాణించిన ఫాతిమాకు అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఫాతిమాకు బాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ సమయంలోనే ఈమె తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.
మీటూ ఉద్యమం గురించి ఫాతిమా మాట్లాడుతూ ఇది కేవలం బాలీవుడ్ కే పరిమితం అయినదిగా ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రతి చోట కూడా లైంగిక వేదింపులు అనేవి ఉన్నాయి. ప్రతి మహిళ ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సమయంలో లైంగిక వేదింపులు అనేవి ఎదుర్కొంటుంది. అయితే ఇంత కాలం ఎవరు కూడా బయటకు రాలేదు, వారి వారి కారణాల వల్ల వారు ఎదుర్కొన్న లైంగిక వేదింపులను బయటకు చెప్పలేదు. కాని మీటూ ఉద్యమం వల్ల కొందరు తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకునేందుకు మీడియా ముందుకు వచ్చారు.
కొందరు నన్ను మీరు ఎందుకు రావడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. మీరు లైంగిక వేదింపులు ఎదుర్కోలేదా అని ప్రశ్నిస్తున్నారు. లైంగిక వేదింపులు ఎదుర్కొన్నంత మాత్రాన మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా జీవితంలో ఎన్నో సందర్బాల్లో లైంగిక వేదింపులు ఎదుర్కొన్నాను. అయితే అది నా వ్యక్తిగతం. దాని గురించి నేను బయటకు చెప్పాలనుకోవడం లేదు, వారి పేర్లు ఏంటీ, ఏ సందర్బంలో నేను వేదింపులు ఎదుర్కొన్నాను అనే విషయాలను చెప్పదల్చుకోవడం లేదు అంటూ ఫాతిమా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.