కాదేది కామెంట్ కు అనర్హం అన్నట్లు ఉంటుంది చాలామంది నెటిజన్ల మైండ్ సెట్. దానికితోడు వీటి పక్కన మతపరమైన ధాట్స్ చేరితే మాత్రం.. ఇక నెట్ లో కాస్త కూడా ప్రశాంతత ఉండదు. ఇప్పుడు దంగల్ సినిమా ఫేం ఫాతిమా సనా షేక్ పరిస్థితి ఇదే విధంగా ఉంది.
అమ్మడు జిక్యూ మ్యాగజైన్ కొత్త ఎడిషన్ కోసం మాల్డీవుల్లో ఒక హాటైన ఫోటో షూట్ చేసింది. ఇప్పటివరకు ఎప్పుడూ తన సోషల్ మీడియాలో కూడా పెద్దగా హాటుగా కనిపించని ఫాతిమా.. ఇప్పుడు ఒకేసారి బికినీల్లోకి వచ్చేసింది. ఆమె ఒక మోడల్.. పైగా ఇప్పుడు అమీర్ ఖాన్ ప్రక్కన హీరోయిన్ గా చేస్తోంది.. కాబట్టి అదేమంత చేయకూడదని పనికాదు. కాని నెట్లో ఆమె ఈ బికినీ ఫోటో పోస్టు చేసింది మొదలు.. ఆమెపై మతపరమైన కామెంట్లతో కొందరు విరుచుకుపడుతూ ఏకంగా ఫత్వా జారీ చేయాలని అంటున్నారు. గతంలో సానియా మీర్జాను వేధించినట్లే వేధిస్తున్నారు.
''అసలు ఒక పవిత్ర మాసంలో ఇలాంటి బికినీ ఫోటోలు ఎందుకు పోస్టు చేస్తున్నావు? మా పరువు తియ్యొద్దు. ఇది మన విశ్వాసాలకు వ్యతిరేకం'' అంటూ ఒక నెటిజన్ పోస్టు చేసి పెద్ద చర్చకే తావిచ్చాడు. చర్చ కాదు పెద్ద పెద్ద కొట్లాటలే జరిగాయ్. అసలు పవిత్ర మాసంలో నువ్వెందుకు ఇంటర్నెట్లో హీరోయిన్ల ఫోటోలు చూస్తున్నావు అంటూ అతని కమ్యూనిటీకే చెందిన కొందరు వ్యక్తులు కూడా అతనికి గాట్టిగానే ఇచ్చారనుకోండి. మొత్తానికి దంగల్ బ్యూటి ఇలా తొలి హాట్ ఫోటో షూట్ తో కాంట్రోవర్శీలపాలైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/