కూతురిగా నటించిన అమ్మాయితో రొమాన్సా?

Update: 2017-03-16 11:06 GMT
ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా చేయడానికి బాగా టైం తీసుకుంటాడు అమీర్ ఖాన్. ‘దంగల్’ తర్వాత ఆయన నటించబోయే కొత్త సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మొదలుకావడానికి ఇంకా చాలానే టైం పట్టేలా ఉంది. ఈలోపు ఈ సినిమా కోసం లుక్ మార్చుకుంటున్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో అమీర్ చేయబోయేది సిక్కు పాత్ర. అందుకోసమే జుట్టు.. గడ్డం అదీ పెంచుతున్నాడు. లుక్ ఫైనలైజ్ అయ్యాకే సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నారు. ఈలోపు కాస్టింగ్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య.

అమీర్ ఖాన్ లాస్ట్ మూవీ ‘దంగల్’లో ఆయన కూతురి పాత్ర పోషించిన ఫాతిమా సనా షేక్‌ ను ఇందులో హీరోయిన్‌ గా కన్సిడర్ చేస్తున్నాడట విజయ్ కృష్ణ. ఈ విషయంలో అమీర్ ఫీలింగ్ ఏంటో కానీ.. సనా అయితే సంతోషంగా ఈ సినిమా చేస్తానంటోంది. కానీ నిర్మాత ఆదిత్య చోప్రానే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కూతురిగా చేసిన అమ్మాయితో రొమాన్స్.. అది కూడా తర్వాతి సినిమాలోనే అంటే బాగోదని ఆయన అంటున్నారట. అయితే విజయ్ కృష్ణ మాత్రం సనా అయితేనే ఈ పాత్రకు కరెక్ట్ అని ఫీలవుతున్నారట. మరి ఫైనల్‌ గా ఏం జరుగుతుందో చూడాలి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన అమీర్‌ కు తండ్రి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇంటర్నేషనల్ లెవల్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలని ఆదిత్య చోప్రా భావిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్‌లో వచ్చిన ధూమ్, ధూమ్-2 సినిమాలకు రచయితగా పని చేసిన విజయ్ కృష్ణ.. ‘ధూమ్-3’తో దర్శకుడి అవతారం ఎత్తాడు. ఆ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ డైరెక్ట్ చేయబోయే సినిమా ఇదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News