ఫవాద్ పాక్ వెళ్లిపోయింది అందుకు కాదట!

Update: 2016-10-08 04:37 GMT
ఉరీ ఉగ్రదాడి అనంతరం భారతదేశంలో పాక్ కళాకారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది మహరాష్ట్ర నవనిర్నాణసేన. 48గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేయడంతో పాటు, అలా వెళ్లకుండా రోడ్లపై ఎక్కడైనా కనిపిస్తే దాడిచేస్తామని కూడా హెచ్చరించింది. అనంతరం వారు పాల్గొనే షూటింగులను కూడా అడ్డుకుంటామని, ఈ విషయాలు సదరు నిర్మాతలు - దర్శకులు ఆలోచించుకుని.. పాక్ నటులకు అవకాశాలు ఇవ్వొద్దని సీరియస్ గా స్పందించింది మహారాష్ట్ర నవనిర్మాణ సేన. ఈ నేపథ్యంలో భారత్‌ లో ఉన్న పాకిస్థాన్‌ నటుడు, పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ఫవాద్‌ ఖాన్‌ గుట్టుచప్పుడు కాకుండా పాకిస్థాన్‌ వెళ్లిపోయాడని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంపై తాజాగా ఫవాద్ స్పందించాడు.

పాక్ నటుడు ఫవాద్ ఖాన్... రాత్రికి రాత్రి చెప్పాపెట్టకుండా - గుట్టుచప్పుడు కాకుండా పాక్ పారిపోయాడని అంతా అనుకుంటున్న దశలో కారణం అదికాదని చెప్పుకొచ్చాడు ఫవాద్. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనున్న కారణంగా లాహోర్‌ కు వెళ్లానని, గత కొన్నిరోజులుగా తన అభిప్రాయం చెప్పమని పలు మీడియా సంస్థలు - శ్రేయోభిలాషులు తనకు చెప్పారని చెప్పాడు. ఇదే సమయంలో ఇద్దరు పిల్లలకు తండ్రిగా - అందరిలాగే అంతా శాంతియుతంగా జీవించాలని ప్రార్థిస్తున్నానని, రేపటి మన పిల్లలు ఈ శాంతిని సొంతం చేసుకుంటారని నమ్ముతున్నానని అన్నాడు. ఈ సమయంలో పాక్ కు మాత్రం ఎలాంటి సూచన చేయడం కాని, ఉగ్రవాదుల విషయంలో పాక్ అనుసరిస్తున్న వైఖరిపై స్పందించడం కాని ఈ పాక్ నటుడు చేయకపోవడం గమనార్హం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News