ఏలూరు అమ్మాయి ఫియర్‌లెస్‌

Update: 2015-07-22 15:51 GMT

Full View
ఎల్‌.బి.డబ్ల్యూ.. లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్‌ (2010) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఏలూరు అమ్మాయి నిశాంతి ఇవానీ. ముంబై, హైదరాబాద్‌ లాంటి నగరాలు ఈ అమ్మడికి కొట్టిన పిండి. సినిమా పరిశ్రమల చుట్టూ తిరుగుతుంది. లఘుచిత్ర దర్శకురాలు కూడా. ఇప్పటికే చిన్నారి అతిధి అనే లఘుచిత్రం తెరకెక్కించి ఆన్‌ లైన్‌లో రిలీజ్‌ చేసింది. అలాగే మరో మూడు లఘుచిత్రాల్ని తెరకెక్కిస్తోంది.

ఫియర్‌ లెస్‌, ప్యార్‌, డైలెమ్మా అనేవి టైటిల్స్‌. ముందుగా 13 నిమిషాల ఫియర్‌ లెస్‌ లఘుచిత్రాన్ని ముంబైలో ప్రీమియర్‌ షో వేయడానికి నిశాని రెడీ అవుతోంది. ఈ చిత్ర కథాంశం ఆసక్తికరం. మగాళ్లు అనుకోని అవకాశం వచ్చినప్పుడు మృగాళ్లు అవుతారని భయపడే ఓ మగువ మానసిక పరిస్థితేంటి? అనేదే కాన్సెప్టు. అనుకోకుండా ఓ టాయ్‌ లెట్‌ లో చిక్కుకున్న యువతి.. తన ముందు ఉన్న యువకుడిని చూసి ఎలాంటి సందేహాలతో హడలిపోవాల్సి వచ్చింది అన్న కాన్సెప్టును లఘుచిత్రంగా చూపిస్తోంది. అమ్మాయి మనసులోని ఆందోళనల గురించిన సినిమా ఇది. చెన్నయ్‌ లో ఓ సందర్భంలో ఓ సీరియస్‌ గొడవ రెయిజ్‌ అయినపుడు తలదాచుకోవడానికి రోడ్డు మీద నుంచి ఓ చిన్న షాపులోకి దూరింది నిశాంతి. అది చాలా ఇరుకు దుకాణం. అప్పటికే అందులో తనలా తలదాచుకోవడానికి కొందరు యువకులు దూరారు. తాను ఒంటరి ఆడది. ఆ సందర్భంలో వాళ్లు పైశాచికత్వం ప్రదర్శిస్తే ఏమయ్యేదో? కానీ అలా జరగలేదు.

అంతేనా కేబీఆర్‌ పార్క్‌ నుంచి జిమ్‌ కి వెళ్లేప్పుడు కొంతమంది కుర్రాళ్లు కొంటె గా చూసేవారు. అలాంటి వాళ్ల చూపుల వల్ల కూడా అమ్మాయి మనసులో ఎలాంటి భయాందోళనలు కలుగుతాయి.. ఇలాంటివన్నీ సినిమాలో చూపిస్తున్నానని చెప్పిందీ అమ్మడు.
Tags:    

Similar News