బన్ని అంతటివాడే ఆ డ్యాన్సులకు పడిపోయానని కితాబిచ్చాడంటే అర్థం చేసుకోవాలి. పిల్లగాడు బిస్కెట్ వేసిండే! అంటూ సాయి పల్లవి వేసిన మెరుపు స్టెప్పులకు మెగాభిమానులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఫ్లాటైపోయారంటే డౌట్ అక్కర్లేదు. అందుకే ఆ సాంగ్ జెట్ స్పీడ్ తో యూట్యూబ్ లో దూసుకుపోయింది. ఎంతగా అంటే.. ఇన్నాళ్లు రికార్డ్ బ్రేకింగ్ సాంగ్ అంటూ ధనుష్ ఆలపించిన `కొలవెరిడి...` గురించి తెగ చెప్పుకున్నాం. అనిరుధ్ ని ఓవర్ నైట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ని చేసిన ఆ పాట రికార్డుల్ని బ్రేక్ చేసే వేరొక సాంగ్ సౌత్‌లో రానేలేదు. ఇన్నాళ్టికి వరుణ్ తేజ్- సాయి పల్లవి జంటగా ఆడిపాడిన `వచ్చిందే` సాంగ్ బ్రేక్ చేసింది.
ఈ క్రేజీ సాంగ్ ను సింగర్ మధుప్రియ ఆలపించింది. నైజాం యాసతో, పడికట్టు పదాలతో ఈ డ్యూయెట్ కి జీవం పోసింది వర్ధమాన గాయని. అలాగే శక్తికాంత్ సంగీతం, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అంతే పెర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ తో కుదిరాయి. సాయిపల్లవి డ్యాన్సింగ్ స్కిల్, కొరియోగ్రఫీ అంతే హైలైట్. తన డ్యాన్సింగ్ ట్యాలెంటుతో పిల్ల అదరగొట్టేయడం వల్లనే ఇలా రికార్డ్ బ్రేకింగ్ హిట్ సాంగ్ అయ్యింది.
ఇంతకీ ఈ సాంగ్ రికార్డు ఎంత? అంటే.. దాదాపు 173 మిలియన్ల వ్యూస్, 418 లైక్ లు సాధించింది. అంతకుముందు కొలవెరి డీ పాటకు 172 మిలియన్ వ్యూస్, 1.4 మిలియన్ లైక్స్ వచ్చాయి. కొలవెరిడి ఇన్నాళ్లు సౌత్ నంబర్- 1 యూట్యూబ్ సాంగ్ గా అలరించింది. ఇప్పటికి ఆ రికార్డును `ఫిదా` (2018 సెప్టెంబర్) `వచ్చిందే..` సాంగ్ బ్రేక్ చేసింది. ఏడేళ్లలో కొలవెరిడి(2011 నవంబర్) సాధించిన ఘనతను కేవలం ఏడాదిలోగానే బ్రేక్ చేసి ఫిదా సాంగ్ సంచలనం సృష్టించింది. శేఖర్ కమ్ముల- దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన ఫిదా బాక్సాఫీస్ వద్దా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. .