2020 ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతున్న RRR గురించిన ఆసక్తికర సంగతులు ఒక్కొక్కటిగా లీకవుతున్నాయి. ఓ వైపు జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..ఏదో ఒక రూపంలో పాన్ ఇండియా మూవీకి సంబంచిన ఆసక్తికర సంగతులు బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బల్గేరియా అడవుల్లో బెంగాల్ టైగర్ తో భీకర పోరాటం చేసిన సన్నివేశాలు తెరకెక్కించారన్న సంగతి లీకైంది. దానికి సంబంధించిన కొన్ని లీక్డ్ ఫోటోలు ఇటీవల అంతర్జాలాన్ని వేడెక్కించాయి. నాటి విప్లయ యోధుడు కొమరంభీమ్ పులి తో వాస్తవం లో పోరాడారో.. లేదో ? తెలియదు కానీ ఆర్.ఆర్.ఆర్ లో మాత్రం ఆ సన్నివేశం హైలైట్ గా నిలవడం ఖాయం అన్న చర్చా సాగింది.
తాజాగా భీమ్ పులిపైనే కాదు...రామ్ పైనా దాడి చేయడం తెరపై చూస్తారన్న టాప్ సీక్రెట్ ని ఓ జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేసేయడం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ కేవలం పులితోనే పోరాటం చేసాడు.. ఆ ఫైట్ సీన్ సినిమా కే హైలైట్ గా నిలుస్తుందని ప్రచారమైంది. కానీ అంతకు మించి వెడెక్కించే మరో సన్నివేశం భీమ్ - రామ్ ఫైట్ అని తాజాగా రివీల్ చేసారు. అల్లూరి సీతారామరాజు(చరణ్)తో కొమురం భీమ్ (ఎన్టీఆర్) ఎటాక్ ఉత్కంఠ పెంచుతుందట. అటుపై అల్లూరి పాత్రధారి రామ్ తిరగబడతాడుట. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల పాటు భీకర పోరాట దృశ్యం రక్తి కట్టిస్తుందని లీకు అందింది. ఈ ఒక్క సన్నివేశాన్ని జక్కన్న రెండు వారాలకు పైగా షూట్ చేసారుట. అందుకు ప్రత్యేకమైన సెట్లు వేసి మరీ కేర్ తీసుకున్నారని తెలిసింది. ఈ సీన్ కూడా ఔట్ డోర్ లో షూట్ చేసినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ మాట ఆనోటా.. ఈనోటా వైరల్ అయ్యి.. చివరికి సోషల్ మీడియాలో వాడి వేడి చర్చకు తావిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత? అన్నది సినిమా చూస్తే గానీ తెలియదు. వాస్తవ కథకు ఫాంటసీ ఎలిమెంట్స్ జోడించి డ్రమటైజ్ చేయడం లో విజయేంద్ర ప్రసాద్-జక్కన్న సిద్ధహస్తులు. ఏ చరిత్రను ఉన్నది ఉన్నట్లు చూపించాల్సిన పనే లేదన్న ఫార్ములాని ఎంచుకున్నారు. తమకు అనుకూలంగా సినిమాటిక్ రూపంలోకి తీసుకు రావడం.. దాన్ని తెరపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయడం జక్కన్నకే తెలుసు. ఆ మేధోతనం జక్కన్నకు ఉంది కాబట్టే బాహుబలి లాంటి స్క్రిప్ట్ తో బాలీవుడ్ మేకర్సే సాధించలేని అరుదైన ఘనతను సాధించగలిగాడు. ఈసారి ఆర్.ఆర్.ఆర్ తోనూ ఎలాంటి సంచలనాలకు తెర తీస్తాడు? అన్నది చూడాలి.