``ఇది ఎల్బీ స్టేడియం. ఇక్కడ నెలాఖరుకి 300 కడితే సరిపోతుంది. నెల మొత్తం రక్తం కూడా కట్టాలి. అట్టాంటోళ్లనే ఇక్కడికి రానిస్తారు. అట్లాంటోళ్లే ఇక్కడ రాణించగలుగుతారు`` .. ఆ ఒక్క డైలాగ్ లోనే మూవీ థీమ్ ఏంటో దాగి ఉంది. ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నం.3 గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫీలర్ వీడియో ఇంట్రెస్టింగ్.
పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ తంజావూర్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి సుశాంత్ రెడ్డి ఇందులో కథానాయకుడు. ఫీలర్ వీడియో చూడగానే ఇది ఒక యాక్షన్ ప్యాక్డ్ తెలుగు స్పోర్ట్స్ డ్రామా అని అర్థమవుతోంది. ఇందులో బాక్సర్ గా సుశాంత్ రెడ్డి నటిస్తున్నారు. వీడియో ఆద్యంతం గూస్ బంప్స్ పుట్టించే బాక్సింగ్ ప్రాక్టీస్ సెషన్స్ తో రక్తి కట్టించారు. హీరో సాయి రెడ్డిలో ఎనర్జీ లెవల్స్ అస్సెట్ కానున్నాయని అర్థమవుతోంది.
బాక్సింగ్ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ లో వరుసగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వరుణ్ తేజ్ నటిస్తున్న గని ఈ తరహాలోనే స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. ఇప్పుడు మరో సినిమాని బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్పోర్ట్స్ డ్రామాల్లో ఎమోషన్ ని రగిలించేందుకు కావాల్సినంత సరంజామా ఉంటుంది. బాక్సింగ్ రింగ్ లో రక్త తర్పణం చేయడమే కాదు ఎమోషన్ రగిలించే ఆసక్తికర కథనం ఉంటే సినిమా సక్సెస్సే. కొత్త కుర్రాళ్ల ప్రయత్నం సఫలమవ్వాలనే ఆకాంక్షిద్దాం.
Full View