సినిమా జనాలకు కొత్త స్టోరీ దొరికేసిందా?

Update: 2016-08-09 08:19 GMT
నయీముద్దీన్ ఎన్ కౌంటర్.. 24 గంటలుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఇదే. నయీమ్ గురించి చెప్పుకోవాలంటే ఓ సినిమా స్టోరీకి మించిన ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి.

ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసే ఓ మాఫియా డాన్.. మావోయిస్టులపై విపరీతమైన వ్యతిరేకత ఉన్న ఓ మాజీ నక్సలైట్.. సరెండర్ అయిన మావోయిస్టులకు ఇతడంటే టెర్రర్.. ఉన్నత పోలీస్ అధికారులకు కోవర్టు.. ఓ గ్యాంగ్ స్టర్.. కోబ్రా గ్యాంగుల క్రియేటర్.. ప్రభుత్వమే పావుగా వాడుకున్న ఓ రౌడీ షీటర్.. ఇలా ఎన్నో రకాలుగా నయీమ్ గురించి కథలు వినిపిస్తాయి. ఒక వ్యక్తి లైఫ్ లో ఇన్ని వేరియేషన్స్ చాలా అరుదు. పైగా మాఫియాకి లింక్ అవడం చాలా మంది దర్శకులను ఆకర్షించే విషయమే. ఇలాంటి సినిమాలు తీయడంలో దిట్ట సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటివరకూ నయీమ్ పై సినిమా తీస్తున్నా అని వర్మ అనౌన్స్ చేయకపోవడమే ఆశ్చర్యకరమైన విషయం. వీలైనంత తొందరలో వినేసినా ఆశ్చర్యం అక్కర్లేదు.

అయినా.. మాఫియా టైపు సినిమాలంటే వర్మకు ఏమన్నా పేటెంట్స్ ఉన్నాయా ఏంటి? ఇలా రియల్ లైఫు కేరక్టర్లతో సినిమా చేసే సత్తా వేరే ఎవరికీ లేదా? ఏమో చూద్దాం.. ఆ తెగువ ఉన్న దర్శకుడు ఎవరో!
Tags:    

Similar News