సినీ నిర్మాతకు రూ.5 కోట్ల జరిమానా.. జైలు

Update: 2021-08-02 05:58 GMT
ఓ సినీ నిర్మాత చిక్కుల్లో పడ్డారు. సినిమాల విషయంలో మోసం చేసినందుకు భారీగా జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా పడింది. ఈ విషయం తాజాగా సినీ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

శాండల్ వుడ్ నిర్మాత కే.సుధాకర్ కు రూ.5 కోట్ల జరిమానాతోపాటు ఏడాది జైలు శిక్ష ఖరారైన సంగతి సంచలనమైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కథా విచిత్ర, హులిదుర్గ వంటి సినిమాలు నిర్మించిన సుధాకర్ పై మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

హాసన్ కు చెందిన ఓ పారిశ్రామికవేత్త నుంచి ఆయన రూ.2.90 కోట్ల రుణం తీసుకున్నారు. లే అవుట్ నిర్మాణాల కోసం అప్పు చేసి ఆ సొమ్ముతో సినిమాలకు పెట్టుబడి పెట్టి సినిమాలు తీశాడు. కానీ ఆ సినిమాలు ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో సమయానికి అప్పులు చెల్లించలేకపోయారు. రాజీ చేసుకున్న సుధాకర్ చెక్కులు ఇచ్చారు. అవి బౌన్స్ కావడంతో పారిశ్రామికవేత్త హాసన్ లోని నలుగో జేఎంఎఫ్.సీ కోర్టును ఆశ్రయించారు.

2020 జనవరి 27న కోర్టు శిక్షను ఖరారు చేసి తీర్పునిచ్చింది. జేఎంఎఫ్.సీ కోర్టు తీర్పుపై సుధాకర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. హాసన్ జిల్లా కోర్టు సదురు పిటీషన్ ను జూలై 16న కొట్టివేయడంతో ఏడాదిన్నర క్రితం జేఎంఎఫ్.సీ కోర్టు తీర్పుకు అనుగుణంగా శిక్షార్హుడయ్యాడు. దీంతో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

సుధాకర్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని హాజన్ జిల్లా పోలీసులు ఆదివారం ప్రకటించారు. ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. 
Tags:    

Similar News