నిర్మాత‌లు అలా ఫిక్స్ చేసి ఇలా బుక్ అయ్యారు!

Update: 2022-09-12 07:34 GMT
టాలీవుడ్ లో ప్ర‌క్షాళ‌న మొదలైన సంగ‌తి తెలిసిందే. న‌టీన‌టుల పారితోషికాల విష‌యంలో సీరియ‌స్ గానే ఆలోచన చేసి కోత దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఆ మధ్య ఏకంగా షూటింగ్ లే బంద్ చేసి సంగ‌తేంటో తెల్చాల‌నే స‌న్నివేశం ఎదుర‌య్యే స‌రికి న‌టీన‌టుల గండుల్లో రైళ్లు పరిగెట్టాయి. ఎన్న‌డూ లేనిది నిర్మాత‌లే షూటింగ్ లు ఆపేయ‌డం ఏంటి? అని ముచ్చ‌టించుకున్నారు.

దీంతో  ఒక్క‌సారిగా   హీరోలు పారితోషికాల విష‌యంలో దిగొచ్చారు. ఆ ర‌కంగా   నిర్మాత‌ల మొద‌టి అడుగు దిగ్విజ‌యంగా  ప‌డింది. ప్ర‌స్తుతం షూటింగ్ ల‌కు ఎలాంటి అడ్డంకి లేదు. ఎవ‌రి సినిమా షూట్ వాళ్లు చేసుకోవ‌చ్చు. అయితే కొంత మంది నిర్మాత‌లు మాత్రం త‌మ సినిమాల్ని ఇంకా హోల్డ్ లోనే పెట్టిన‌ట్లు తెలుస్తోంది. వారు సైతం కొత్త ప్లాన్ లు అమ‌లు చేయాల‌ని  నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది.

స‌హాయ న‌టుల పేరుతో భారీగా పారితోషికాలు వ‌సూళ్లు చేసే న‌టుల విష‌యంలోనూ నిర్మాత‌లు కొర‌డా ఝుళిపించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. పేరున్న కొంత మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు కూడా భారీగానే ఛార్జ్ చేస్తున్నారు.

వాళ్ల‌తో పాటు వెంట అసిస్టెంట్ల   ఉంటున్నారు. అయితే తాజా స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో స‌హాయ న‌టులకి  సైతం ఫిక్స్ డు  రెమ్యున‌రేష‌న్ ఫిక్స్ చేసారు. ఆ ప్యాకేజీలోనే త‌మ సిబ్బంది ఖ‌ర్చు సైతం క‌లిపి ఓ ప్యాకేజీ తొసుకొచ్చారు.

కానీ ఇక్క‌డిదే స‌మ‌స్య‌గా మారింది. ఇలా ఫిక్స్  చేయ‌డంతో కొంత మంది ఆర్టిస్టులు అధికంగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇంత కాలం డైలీ బేస్  అందుకున్న వాళ్లంతా డిమాండ్ కి ప‌ట్టుబ‌డుతున్నారు. అదీ గాక త‌మ సిబ్బంది ఖ‌ర్చులు అన్నింటిని నిర్మాత‌లే భ‌రించాల‌ని  కోరుతున్నారు. ఇప్పుడిదే నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పిగా  మారింది.

న‌టుల‌తో పాటు సిబ్బంది వ్య‌క్తిగ‌త‌ ఆహార..ప్ర‌యాణ ఖ‌ర్చులు నిర్మాత‌కు అద‌న‌పు భారంగా క‌నిపిస్తుంది. ప్యాకేజీలో వాటిపై స్ప‌ష్ట‌త లోపించ‌డంతో వాటిని స‌వ‌రించిందే   దిశ‌గా ఆలో చ‌న చేస్తున్న‌ట్లు తెలిసింది. ఇవ‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చిన త‌ర్వాత టాలీవుడ్ మ‌ళ్లీ షూటింగ్ ల‌తో క‌ళ‌క‌ళ‌లాడే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే కొన్ని సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. అయితే ఔట్ డోర్ షూటింగ్ లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News