'లవ్‌ స్టోరీ' విడుదలకు తుది మెరుగులు

Update: 2021-08-22 07:30 GMT
నాగచైతన్య.. సాయి పల్లవి జంటగా నటంచిన లవ్‌ స్టోరీ సినిమా గత ఏడాది నుండి వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సినిమా కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత వచ్చే నెలలో విడుదలకు రెడీ అయ్యింది. సెప్టెంబర్‌ 10న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లవ్‌ స్టోరీ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ తర్వాత రాబోతున్న మొదటి పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. అందుకే ఈ సినిమా ఫలితంపై ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి కూడా మరో ఫిదా ఖాయం అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో విడుదల కాబోతున్న లవ్‌ స్టోరీ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ ను దక్కించుకుంటుందో చూడాలి.

లవ్‌ స్టోరీ షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా రోజులే అయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. సెన్సార్‌ కు వెళ్లాల్సి ఉంది. అయితే సినిమా ఎడిటింగ్ పూర్తి అయినా మళ్లీ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడు శేఖర్‌ కమ్ముల మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా ఎక్కువ నిడివి ఉంటే జనాలు కాస్త ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. సాధ్యం అయినంత తక్కువ నిడివి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాను కూడా తక్కువ నిడివి ఉన్న సినిమాగా మార్చేందుకు గాను ప్లాన్‌ చేస్తున్నారు.

ఇప్పటికే ఎడిట్‌ చేసిన లవ్‌ స్టోరీకి మళ్లీ కాస్త ఎడిట్ ను చేసినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన తుది మెరుగుల పనిలో శేఖర్ కమ్ముల ఉన్నాడు. వచ్చే వారం నుండి సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రమోషన్స్ ను మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా తో నాగచైతన్య కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ సక్సెస్ పడబోతుంది అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఫిదా తర్వాత శేఖర్‌ కమ్ముల నుండి వస్తున్న సినిమా అవ్వడంతో పాటు.. ఫిదాలో నటించిన సాయి పల్లవి ఈ సినిమాలో నటించడం వల్ల సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలో ఒక క్యూట్‌ నాచురల్‌ లవ్‌ స్టోరీ ఉందని ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు పాటలను బట్టి క్లారిటీ వచ్చింది. కనుక సినిమా తప్పకుండా ఒక మంచి డీసెంట్ సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.
Tags:    

Similar News