హీరోయిన్‌ కు కారు గిఫ్ట్‌ ఇచ్చానంటున్న ఆర్థిక నేరస్థుడు

Update: 2021-10-24 04:21 GMT
బాలీవుడ్‌ సెలబ్రెటీలను షేక్‌ చేస్తున్న వ్యక్తి సుఖేశ్‌ చంద్ర శేఖర్‌. ఇతడు పాత కేసులతో అరెస్ట్‌ అయ్యి తీహార్ జైల్లో ఉన్నాడు. ఇదే సమయంలో అతడికి సంబంధించిన ఆర్థిక నేరాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి భార్య నుండి ఏకంగా 200 కోట్ల రూపాయలను ఈయన వసూళ్లు చేశాడనే అనుమానాలు ఉన్నాయి. ఆమెను బెదిరించి.. బ్లాక్‌ మెయిల్ చేసి ఈ వసూళ్లను అతడు చేశాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 200 కోట్ల రూపాయల విషయంలో ప్రస్తుతం అతడిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ విచారణలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. కొందరు ప్రత్యక్షంగా ఈ కేసుతో సంబంధం కలిగి ఉంటే కొందరు మాత్రం పరోక్షంగా కేసుతో సంబంధం కలిగి ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో బాలీవుడ్ హాట్ బ్యూటీస్ నోరా ఫతేహి మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు చిక్కుకున్నారు.

ఇప్పటికే నోరా ఫతేహిని ఈ కేసులో మూడు సార్లు ఈడీ అధికారులు విచారించారు. సుఖేశ్‌ తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అతడితో తనకు ఎప్పుడు కూడా ఆర్థిక లావాదేవీలు జరుగలేదు అంటూ తేల్చి చెప్పింది. ఈ సమయంలోనే సుఖేశ్‌ ఈడీ విచారణలో వెళ్లడించిన విషయం నోరాను చాలా ఇబ్బందిలోకి నెట్టేసింది. కొన్నాళ్ల క్రితం తాను నోరా ఫతేహికి ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసి ఇచ్చినట్లుగా పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని కూడా అతడు చెప్పాడట. దాంతో నోరా ను ఆ విషయమై అధికారులు మరోసారి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

నోరా మేనేజర్ మాత్రం సుఖేశ్‌ వ్యాఖ్యలను ఖండించాడు. అతడి నుండి నోరాకు ఎలాంటి గిఫ్ట్‌ రాలేదని.. ఇప్పటికే అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని నోరా క్లీయర్ గా చెప్పేసింది. ఇంకా అనుమానాలు ఉంటే విచారణకు హాజరు అయ్యేందుకు నోరా సిద్దంగా ఉందని మేనేజర్‌ పేర్కొన్నాడు. మీడియాలో ఈ విషయమై అతిగా కథనాలు రాయవద్దని అతడు విజ్ఞప్తి చేశాడు. మరో వైపు హాట్‌ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాత్రం ఈడీ అధికారుల నోటీసులను బేకాతరు చేస్తూ వస్తోంది. ఆమెను విచారణకు హాజరు అవ్వాల్సిందిగా మరోసారి ఈడీ అధికారులు నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News