హిందీ నటుడు అలోక్ నాథ్ పై మీటూ ఉద్యమంలో భాగంగా ఒక మహిళ లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. 19 ఏళ్ల క్రితం అలోక్ నాథ్ తనను రేప్ చేశాడని - ఆ సమయంలోనే తాను ఆ విషయాన్ని బయట చెప్పేందుకు ప్రయత్నించగా నా నోరు నొక్కేశారని - ఆయన పలుకుబడితో నాకు ఆఫర్లు రాకుండా చేస్తాడని బెదిరి పోయి అప్పట్లో నేను సైలెంట్ గా ఉండి పోయాను అంది. ఇప్పుడు మీటూ ఉద్యమంలో భాగంగా నేను ఆయన గురించిన విషయాన్ని చెబుతున్నాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఈ వయస్సులో అలోక్ నాథ్ పై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఆయన సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు.
అలోక్ నాథ్ పై ఆమె చేసిన ఆరోపణల వల్ల ఉచ్చు బిగుసుకుంటుంది. పోలీసులు - మహిళ సంఘాల వారు - కోర్టు ఇలా అన్ని విధాలుగా ఆయన ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడు. ఇప్పటికే రేప్ కేసు నమోదు అవ్వడంతో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. తనపై వచ్చిన ఆరోపణలను మొదటి నుండి కూడా కొట్టి పారేస్తూ వస్తున్న అలోక్ నాథ్ తాజాగా మరోసారి తాను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు - బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిర్యాదు కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులతో పాటు జాతీయ మహిళ కమీషన్ ను కూడా బాధితురాలు ఆశ్రయించిన నేపథ్యంలో కేసు వేగంగా విచారణ జరపాలని మహారాష్ట్ర డీజీపీకి మహిళ కమీషన్ లేఖ రాసింది. దాంతో అలోక్ నాథ్ ఈ వయస్సులో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని - జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుందేమో అంటూ బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.