అదేంటో కొంతమందికి చెయ్యని పని చేసేయ్యలని కుతూహలంగా ఉంటుంది. నో పార్కింగ్ లో బండి పార్క్ చేయడం ఇలాంటివి కొందరు కావాలని చేస్తారు కొందరు పాపం తెలియక చేసి చిక్కుల్లో పడతారు. మరి తెలిసి చేసిందో తెలియక చేసిందో కాని.. బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండ్ కూడా అలానే చేయొద్దు అన్న ఒక పని చేసి చిక్కుల్లో ఇరుక్కుంది.
కొన్ని ఆలయాలలో సెల్ ఫోన్స్ లేదా కెమెరాలను ను లోపలికి తీసుకురానివ్వరు. అక్కడ ఫోటోలు వీడియోలు తీయడం నిషిద్ధం. కానీ రవీనా టాండన్ అలాంటి ఆలయాల్లో ఒకటైన భువనేశ్వర్ లోని లింగరాజ్ ఆలయంలో బ్యూటీ టిప్స్ చెప్తుండగా ఒక వ్యక్తి కెమెరా తో షూట్ చేశాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవ్వగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గుడి యాజమాన్యం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఆమె పైన ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేశారు. ఆ ఆలయం ఇంచార్జీగా పని చేస్తున్న రాజీవ్ లోచన్ పరిందా 'నో కెమెరా' జోన్లో ఒక యాడ్ ఫిల్మ్ చిత్రీకరించిన కారణంగా రవీనా టాండన్ పై కేస్ వేయడం జరిగింది అని చెప్పారు.
భువనేశ్వర్ డి.సి.పి సతిబ్రాట్ భోయ్ కూడా ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ అయింది అంటూ చెప్పారు. ఆలయంలోకి అక్కడి స్టాఫ్ తప్ప మరెవ్వరికి ఫోన్ తీసుకెళ్లే పెర్మిషన్ లేదు. ఇలా జరగడం వల్ల భక్తులంతా మనస్తాపం చెందుతున్నట్టు తెలుస్తోంది. దీనిపైన విచారణ ఇంకా జరగాల్సి ఉంది.