స్టార్‌ హీరోయిన్‌ పై చీటింగ్‌ కేసు

Update: 2018-11-28 10:54 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా ప్రస్తుతం హీరోయిన్‌ గా పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. కొన్నాళ్ల ముందు వరకు ఈమెకు స్టార్‌ హీరోయిన్‌గా మంచి ఆఫర్లు దక్కాయి. కాని ప్రస్తుత పరిస్థితి వేరు. సినిమాల్లో పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఈమె కార్యక్రమాలకు హాజరు అవుతోంది. ఫ్యాషన్‌ వీక్స్‌ - అవార్డు ఫంక్షన్స్‌ వంటి కార్యక్రమాలకు ఈమె హాజరు అయితే పారితోషికం బాగానే ముడుతోంది. తాజాగా ఈమె ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు అడ్వాన్స్‌ తీసుకుని - తీరా కార్యక్రమం రోజు రాలేను అంటూ చెప్పి నిర్వాహకులకు షాక్‌ ఇచ్చింది. దాంతో నిర్వాహకులకు భారీ నష్టం వాటిల్లిందట. ఆ కారణంగా ఆమెపై చీటింగ్‌ కేసును నిర్వాహకులు పెట్టారు.

గత సెంప్టెబర్‌ 30న దిల్లీలో ఇండియా ఫ్యాషన్‌ అండ్‌ బ్యూటీ అవార్డ్స్‌ కార్యక్రమంను నిర్వహించారు. ఆ కార్యక్రమంలో సోనాక్షి సిన్హా డాన్స్‌ చేసేందుకు 2.8 లక్షలకు గాను డీల్‌ కుదిరిందట. జూన్‌ నెలలోనే నిర్వాహకులు ఆమెకు ఇచ్చేశారట. ఇక ఆమె ప్రయాణంకు ముందే విమానం టికెట్టును బుక్‌ చేశామని కార్యక్రమం జరిగిన రోజు ఉదయం 10 గంటలకు ఆమె రాక పోవడంతో ఆ టికెట్‌ ను క్యాన్సిల్‌ చేసి - అదే రోజు మద్యాహ్నంకు బుక్‌ చేశాం. కాని మద్యాహ్నం విమానంకు కూడా ఆమె రాలేదు. ఆమె రాకపోవడంతో షో కు వచ్చిన ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యక్రమాన్ని తిరష్కరించి వెళ్లారని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె రాకపోవడం వల్ల తాము నష్టపోయామని పేర్కొన్నారు. అందుకే షో నిర్వాహకులు పోలీసులకు 37 లక్షల రూపాయలకు సోనాక్షి మరో ఏడుగురు మోసం చేశారంటూ చీటింగ్‌ కేసు ఫిర్యాదు ఇచ్చారు. సినిమాలు లేక ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సోనాక్షి సిన్హాకు ఇది మరో పెద్ద షాక్‌ గా చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News