బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఓ మ్యాగజైన్ కోసం ఒంటి పై నూలు పోగు లేకుండా అతను చేసిన ఫొటో షూట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో వివాదాస్పదంగా మారింది. టాలెంటెడ్ హీరో డేరింగ్ షూట్ కు మద్దతిచ్చే వారి కంటే విమర్శించేవారే ఎక్కువ మంది ఉన్నారు.
రణ్ వీర్ సింగ్ నగ్న ఫొటోలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురు రోడ్లపైకి వచ్చి బాలీవుడ్ స్టార్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ముంబయిలో రణ్ వీర్ పై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ముంబయికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థతో పాటు మరో మహిళా న్యాయవాది చెంబూర్ పోలీస్ స్టేషన్ లో నటుడి పై వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు.
రణ్ వీర్ న్యూడ్ ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా మహిళల గౌరవానికి భంగం కలిగించారని.. వారి మనోభావాలు దెబ్బ తీశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా న్యాయవాది మరియు మాజీ జర్నలిస్ట్ దాఖలు చేసిన దరఖాస్తుల మేరకు రణవీర్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 67 (A)తో పాటుగా సెక్షన్ 292 - 293 - 509 సెక్షన్ల కింద పోలీసులు రణవీర్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు కాబట్టి.. ఈ న్యూడ్ ఫోటో షూట్ ఇష్యూ బాలీవుడ్ హీరోకి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా, రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ''నేను శారీరకంగా నగ్నంగా ఉండడం చాలా సులభం.. కానీ కొన్ని ప్రదర్శనలో నేను ఇలా కనిపిస్తాను అని తెలియజేశారు.. నేను ఎంతమంది ఉన్నా సరే ఇలా నగ్నంగా ఉండగలను. ఈ విషయంలో నాకు ఎలాంటి సిగ్గు బిడియం లేదు..'' అని పేర్కొన్నారు.
రణ్ వీర్ పెట్టిన ఈ పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓవైపు అతనిపై ట్రోల్స్ వస్తుంటే.. మరోవైపు ఈ నూడ్ ఫోటో షూట్ ని ట్రెండ్ గా మార్చేస్తున్నారు. గుత్తా జ్వాల గుత్త భర్త, తమిళ హీరో విష్ణు విశాల్ కూడా రణ్ వీర్ ట్రెండ్ ను ఫాలో అవుతూ తన నగ్న ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఫోటోలు తీసింది తన భార్యే అని తెలిపాడు. మరి రానున్న రోజుల్లో ఇంకెంతమంది నటులు నగ్న ప్రదర్శన చేస్తారో చూడాలి.