ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీరాలలో ఓ ధియేటర్ అగ్ని ప్రమాదానికి గురైంది. మరమ్మతుల అనంతరం తిరిగి నూతనంగా ప్రారంభం కాబోతున్న ఈ థియేటర్ ఈ విధంగా ప్రమాదానికి గురవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ థియేటర్ మూవీ మొఘల్ దగ్గబాటి రామానాయుడు కుటుంబానికి చెందినది. దివంగత దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి చెందిన సురేష్ మహల్ కు మరమ్మతులు చేసి రెండు థియేటర్లుగా అత్యాధునిక టెక్నాలజీతో తీర్చిదిద్దారు.
వాటిలో ఒక థియేటర్ పూర్తి కావడంతో రేపు దగ్గుబాటి రాణా చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. థియేటర్ లో ఏసీలు బిగిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. అందరూ చూస్తుండగానే హాల్ మొత్తానికి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో కొన్ని లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.