దివంగత దర్శకుడు శోభన్ వారసుడు సంతోష్ శోభన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది. అయితే కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఇప్పుడు ఆయన వరుసగా సినిమాల్లో నటిస్తూ నటుడిగా మంచి పేరును దక్కించుకున్నాడు. ఇలాంటి సినిమాలు.. అలాంటి సినిమాలు అని కాకుండా మంచి ప్రాజెక్ట్ లను ఈయన కమిట్ అవుతూ నటుడిగా మంచి పేరును దక్కించుకుంటున్నాడు.
కేవలం సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ ల్లో కూడా నటించడం ద్వారా సంతోష్ శోభన్ కి ఇప్పటికే యూత్ లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది అనడంలో సందేహం లేదు. సినిమాల యొక్క సక్సెస్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను సంతోష్ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం విభిన్న చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా ను చేస్తున్నాడు.
కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ సినిమాల దర్శకుడిగా పేరున్న మేర్లపాక గాంధీ ప్రస్తుతం సంతోష్ శోభన్ తో తెరకెక్కిస్తున్న సినిమాకి లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. ఈ టైటిల్ ను కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.
ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వస్తోంది. టైటిల్ కి తగ్గట్లుగా లైక్ చేయవచ్చు.. షేర్ చేయవచ్చు అన్నట్లుగా ఫస్ట్ లుక్ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. యూట్యూబర్స్ కష్టాలను... వారు చిన్న షార్ట్ ఫిల్మ్ కోసం కూడా ఎంతగా కష్టపడుతారు అనే విషయాలను ఈ సినిమాలో ఫన్నీగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
టైటిల్ లోనే యూట్యూబ్ కు సంబంధించిన సినిమా అయ్యి ఉంటుందనిపించేలా దర్శకుడు క్లారిటీ ఇస్తున్నారు. కనుక ఈ సినిమా ఫన్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాలో సంతోష్ శోభన్ కి జోడీగా జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ మధ్య కాలంలో కమెడియన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న సుదర్శన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ లో ఈ ముగ్గురు చాలా ఆసక్తిగా పైకి చూస్తున్నట్లుగా ఉంది.. వారు ఒక అడవిలో ఉన్నారు. ఇంట్రెస్ట్ గా ఉన్న ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.