కీర్తి సురేష్‌ గర్భవతి

Update: 2019-10-17 14:13 GMT
'మహానటి' చిత్రం తర్వాత కీర్తి సురేష్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగి పోయింది. తమిళంలో ఒక చిన్న హీరోయిన్‌ గా కెరీర్‌ ను ప్రారంభించిన కీర్తి సురేష్‌ ప్రస్తుతం తెలుగు.. తమిళంలోనే కాకుండా బాలీవుడ్‌ లో కూడా నటిస్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు ఈమె కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలుస్తోంది. సౌత్‌ లో నయనతార తర్వాత ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు కీర్తి సురేష్‌ ను ఎక్కువగా సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ఈమె 'పెంగ్విన్‌' అనే లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో నటిస్తోంది.

తెలుగు.. తమిళంలో రూపొందుతున్న 'పెంగ్విన్‌' చిత్రంలో కీర్తి సురేష్‌ గర్భవతిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. నేడు కీర్తి సురేష్‌ పుట్టిన రోజు కావడంతో ఆమె నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ మరియు ఇతర సినిమాల అప్‌ డేట్స్‌ వచ్చాయి. అయితే అందరి దృష్టి పెంగ్విన్‌ ను ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు గ్లామర్‌ రోల్స్‌ తో పాటు విభిన్నమైన పాత్రలు చేసిన కీర్తి సురేష్‌ మొదటి సారి గర్బవతిగా సినిమాలో నటించబోతుంది.

సినిమాలో ఎక్కువ సమయం కీర్తి సురేష్‌ గర్భవతిగా కనిపించనుందని.. అందుకే ఫస్ట్‌ లుక్‌ గా గర్భవతిగా ఉన్న ఫొటోను విడుదల చేశారంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి. మహానటి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న కీర్తి సురేష్‌ మరోసారి ఈ చిత్రంలోని నటనతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో పాటు కీర్తి సురేష్‌ 'మిస్‌ ఇండియా' అనే తెలుగు సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాల్లో కూడా కీర్తి సురేష్‌ నటన పీక్స్‌ లో ఉంటుందట. ఈ రెండు కూడా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలే.

Tags:    

Similar News