సినిమాల మధ్య ఎంత పోటీ ఉన్నా.. తమ సినిమాలతో ఫైట్ చేస్తున్నా సరే ఇప్పటి యువ హీరోలు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటున్న విధానం చాలా బాగుంది. పోటీ సినిమాలతోనే తప్ప వ్యక్తిగతంగా మేమంతా ఒక్కటే అని మరోక్కసారి ప్రూవ్ చేశారు టాలీవుడ్ యంగ్ హీరోస్. విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఓరి దేవుడా మూవీ దీవాళి దావత్ లో యువ హీరోలు అల్లరి నరేష్, సిద్ధు జొన్నలగడ్డ, సందీప్ కిషన్, ఆది సాయికుమార్, ఆకాష్ పూరీ పాల్గొన్నారు.
ఈవెంట్ కి వచ్చిన యువ హీరోలంతా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో సినిమాలు చేస్తున్నారు. విశ్వక్ సేన్ కోసం అందరు కలిసికట్టుగా వచ్చారు. సినిమా పరిశ్రమలో యూనిటీ ఉండదు. హీరోల మధ్య ఈగో క్లాషెస్ ఉంటాయని అనుకునే వారికి ఈ ఈవెంట్ ఒక కనువిప్పు అని చెప్పొచ్చు. జరిగింది విశ్వక్ సేన్ సినిమా ఈవెంట్ కాబట్టి అతనికి సినిమా మీద ఉన్న ప్యాషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్థావించారు.
విశ్వక్ సేన్ నెక్స్ట్ సూపర్ స్టార్ అనేశాడు డీజే టిల్లు అలియాస్ సిద్ధు జొన్నలగడ్డ. ఓరి దేవుడా దీవాళి దావత్ లో మాట్లాడిన సిద్ధు తన హుశారైన స్పీచ్ తో ప్రేక్షకులను అలరించారు. విశ్వక్ సేన్.. సినిమా తర్వాత సినిమా చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాడు. అతని నుంచి తాను చాలా నేర్చుకున్నానని.. కొన్ని విషయాల్లో అతన్ని స్పూర్తిగా తీసుకున్నానని అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. విశ్వక్ కి సోప్ వేయాల్సిన అవసరం లేదని.. అతను తప్పకుండా ఫ్యూచర్ సూపర్ స్టార్ అవుతాడని అన్నారు సిద్ధు.
ఈ ఈవెంట్ లోనే గ్యాంగ్ లీడర్ గా వచ్చిన అల్లరి నరేష్ కూడా తన స్పీచ్ తో ఆడియన్స్ ని అలరించారు. డైరక్టర్ అశ్వత్ ఓ మై కడవులే తమిళ వర్షన్ చూశానని.. అతను మంచి ప్రతిభ గల దర్శకుడని అన్నారు నరేష్. ఇక విశ్వక్ గురించి చెబుతూ అతను వెరీ టాలెంటెడ్.. ఒక డైరక్టర్ గా.. రైటర్ గా.. యాక్టర్ గా ఫెంటాస్టిక్ సినిమాలు చేస్తున్నారని అన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూ ఇదే స్పీడ్ తో ఇంకా ముందుకు వెళ్లాలని అన్నారు. విశ్వక్ ఇంకా పెద్ద స్థాయికి చేరుకుంటాడని.. చేరుకోవాలని అన్నారు అల్లరి నరేష్.
తమిళ వర్షన్ చూశాక దేవుడి పాత్ర ఎవరు నటిస్తారా అని అనుకున్నాను.. వెంకటేష్ గారు అది చేయడం సూపర్.. ఆయన ఎమోషన్ సీన్ చేసినా అది సూపర్ గా ఉంటుందని అన్నారు అల్లరి నరేష్. ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవాలని అన్నారు. ఈవెంట్ లో పెళ్లైన హీరోలు.. పెళ్లి కాని హీరోలు వచ్చారంటూ కామెడీ చేసిన సందీప్ కిషన్ విశ్వక్ అంటే తనకు చాలా ఇష్టమని అతనికి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. యువ హీరోలంతా వచ్చి తన సినిమాని ప్రమోట్ చేయడం ఓరి దేవుడా మూవీ ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.