టాలీవుడ్ లో ఫారిన్ సినిమాటో గ్రాఫర్ ల ట్రెండ్ మొదలైంది. తెలుగు సినిమాలలో కొన్ని దశాబ్దాల క్రితమే లెజెండరీ డైరెక్టర్లు కె.వి. రెడ్డి. బి.ఎన్. రెడ్డి, ఎల్వీ ప్రసాద్, కమలాకర కామేశ్వరరావు వంటి దర్శకులు ఫారిన్ సినిమాటోగ్రాఫర్లని తమ సినిమాలకు ఉపయోగించుకుని మరపురాని మర్చిపోలేని అద్భుత కళాఖండాలని తెరపై ఆవిష్కరించారు. అంగ్లో ఇండియన్ అయిన మాస్కస్ బాట్లే తెలుగులో మరపునా ఇసినిమాలకు ఎన్నింటికో సినిమాటోగ్రఫీని అందించి తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
మళ్లీ ఇన్నాళ్లకు మన లెజెండరీ డైరెక్టర్లని ఫాలో అవుతూ స్టార్ డైరెక్టర్స్ ఫారిన్ సినిమాటోగ్రాఫర్లని పాన్ ఇండియా సినిమాల కోసం దిగుమతి చేసుకుంటున్నారు. డానీ సాంచెజ్ లోపెజ్ ని కీర్తి సురేష్ నటించిన `మహానటి` కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఆ తరువాత రానా, సాయి పల్లవి జంటగా నటించిన `విరాటపర్వం` మూవీకి డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే.
ఆ తరువాత నేచురల్ స్టార్ నాని నటించిన `నాని గ్యాంగ్ లీడర్` సినిమాతో మిరస్లోవ్ బ్రోజెక్ ని సినిమాటోగ్రాఫర్ గా టాలీవుడ్ కు పరిచయం చేయడం తెలిసిందే. ఈ మూవీ తరువాత తను అల్లు అర్జున్ నటించిన `పుష్ప` మూవీకి వర్క్ చేశాడు. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో దీనికి సీక్వెల్ గా ప్రస్తుతం `పుష్ప 2` రూపొందుతోంది. దీనికి కూడా తనే వర్క్ చేస్తున్నాడు. ఇదిలా వుంటే తాజాగా ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` కోసం మరో ఫారిన్ డీఓపీని దించేస్తున్నారు.
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మూవీ `ప్రాజెక్ట్ కె`. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్ లుగా దీపికా పదుకునే, దిషా పటానీ నటిస్తున్నారు. ఈ మూవీ ద్వారా సెర్బియన్ సినిమాటోగ్రాఫర్ డిజోర్డ్‌జే స్టోజిల్ కోవిక్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు. అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలింస్ కి, సెర్బియన్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా డిజోర్డ్‌జే స్టోజిల్ కోవిక్ వర్క్ చేశాడు.
హాలీవుడ్ మార్వెల్ తరహా సూపర్ హిరో మూవీగా తెరకెక్కుతున్న `ప్రాజెక్ట్ కె` కు డిజోర్డ్‌జే స్టోజిల్ కోవిక్ విజువల్స్ ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. వీఎఫ్ ఎక్స్ కి అత్యంత ప్రధాన్యత వున్న సినిమా కావడంతో డీవోపీతో పాటు పలువురు కీలక టెక్నీషియన్ లని కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే రప్పించినట్టుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.