ఒకేసారి నలుగురు రాణులు కనిపిస్తే

Update: 2017-11-29 16:34 GMT
అసలే విచిత్రమైన చిత్రం. ఆ చిత్రాన్ని ఇప్పుడు విచిత్రంగా ముగ్గురు భామలు వారి మేకింగ్ స్టైల్ లో చిత్ర విచిత్రాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ విచిత్రం అంటే చాలా స్పెషల్ చిత్రం అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఎంతో స్పెషల్ గా బాలీవుడ్ లో తెరకెక్కిన క్వీన్ చిత్రం బాక్స్ ఆఫీస్ ని చాలా విచిత్రంగా షేక్ చేసింది. కంగనా రనౌత్ అద్భుతమైన నటనను నార్త్ ప్రేక్షకులు ఆదరించారు.

అయితే ఇప్పుడు అదే తరహాలో సౌత్ ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చెయ్యాలని నలుగురు హీరోయిన్స్ ఎంతో కష్టపడుతున్నారు. తెలుగులో క్వీన్ పేరుతో తమన్నా చేస్తుండగా.. తమిళ్ పారిస్ పారిస్ అనే పేరుతో కాజల్ అగర్వాల్ రీమేక్ ను చేస్తోంది. ఇక కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పారుల్ యాదవ్ బటర్ ఫ్లై అంటోంది. అలాగే మోహన్ మంజిమా మలయాళంలో జామ్ జామ్ అనే పేరుతో క్వీన్ రీమేక్ లో నటిస్తోంది.

ఈ తరహాలో ఒకే భాషలో ఒక కథ తెరకెక్కడం స్పెషల్ అయితే మళ్లీ ఒకేసారి అందరు షూటింగ్ చేస్తుండడం మరొక స్పెషల్ అనాలి. అయితే ఈ నలుగురు హీరోయిన్స్ ఫ్రాన్స్ లో ఉండి రేపు ఫెస్ బుక్ లైవ్ లోకి రాబోతున్నారట. సరదాగా చిత్ర విశేషాలని అభిమానులతో పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ లోకి రానున్నారు ఈ నాలుగురు రాణులు. ఇక మరి మీరు ఏమైనా సందేహాలు ఉంటే మీకు ఇష్టమైన హీరోయిన్స్ అడగడానికి రెడీగా ఉండండి. 
Tags:    

Similar News