అశ్లీల చిత్రాలు తీసిన కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాజ్ కుంద్రాను జూలై 27వరకు జ్యూడిషియల్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ముంబై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో రాజ్ కుంద్రా సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు ప్రత్యేక సాక్షులుగా వచ్చినట్లు సమాచారం. దీంతో కేసులో రాజ్ కుంద్రా బుక్కైనట్టుగా తెలుస్తోంది.
రాజ్ కుంద్రా చుట్టు ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు ఈ కేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పేందుకు ముందు కు వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు సీబీఐని సంప్రదించినట్టు తెలుస్తోంది.
తాజాగా పోలీసులు రాజ్ కుంద్రాను విచారించారు.మరోసారి శిల్పాశెట్టి -రాజ్ కుంద్రా నివాసానికి చేరుకొని సోదాలు చేస్తున్నట్టు సమాచారం ఈ సోదాల్లో దాదాపు 100కు పైగా అశ్లీల వీడియోల డేటా లభించినట్లు తెలుస్తోంది. ఇక వాటికి ఖర్చు కూడా తక్కువగానే పెట్టారని విచారణలో తేలిందట..ఇ క కేసును మరింత సీరియస్ గా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తీసుకున్నారు. అధికారులు ఏమాత్రం పట్టువిడవడం లేదు. రాజ్ కుంద్రా ఇంట్లో అలాగే అతడి సన్నిహితుల ఇంట్లో కూడా మరికొన్ని రోజుల వరకూ సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.రాజ్ కుంద్రా బిజినెస్ అసోసియేట్ ర్యాన్ తోర్పేను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. మూడు రోజుల పాటు పోలీసు రిమాండ్ ముగియడంతో ప్రవేశపెట్టారు.
ముంబైలోని అంధేరిలో ఉన్న వియాన్ అండ్ జేఎల్ స్ట్రీమ్ ఆఫీసులో క్రైమ్ బ్రాంచ్ అధికారులు మరోసారి సోదాలు జరిపారు. ఇందులో వాళ్లకు ఓ సీక్రెట్ కబోర్డ్ కనిపించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జులై 19నే అక్కడి వాళ్లు వెతకగా ఇది కనిపించలేదు. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రాతో సంబంధం ఉన్న పలువురిని శనివారం ప్రశ్నించడంతో వాళ్లు ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం.
ఈ కేసులో వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలపై రాజ్ కుంద్రా నోరు విప్పడం లేదని తెలుస్తోంది. రాజ్ కుంద్రా సహకరించడం లేదని క్రైం బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా రాజ్ కుంద్రా కేసులో సాక్ష్యం చెప్పేందుకు నలుగురు ఉద్యోగులు ముందుకు వచ్చినట్టు సమాచారం. వీరే ఈ కేసులో కీలకంగా మారనున్నారని పోలీసులు భావిస్తున్నారు. మేజిస్ట్రేట్ సమక్షంలో త్వరలో వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు సమాచారం.