బాలీవుడ్ లో సూపర్ హిట్ రియాల్టీ షో బిగ్ బాస్ కు అశేష ప్రేక్షకాదరణ లభించింది. అదే షోను సౌత్ ఇండియాలో కూడా స్టార్ట్ చేసి కాసుల పంట పండించాలనుకున్నారు ఆ షో నిర్వాహకులు. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన తమిళ బిగ్ బాస్ కు ఆదరణ కరువైంది. విలక్షణ నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నా ఈ షో పెద్దగా క్లిక్ అవ్వలేదు. తాజాగా, ఈ షో ప్రసారాన్ని నిలిపియేయాలని ఓ
స్వచ్ఛంద సేవా సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఈ షో వ్యాఖ్యాత కమల్‌హాసన్ ను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ హిందూ మక్కల్ కట్చి(హెచ్ఎంకే) సభ్యులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమిళ సంస్కృతిని కమల్‌హాసన్ నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు. తమిళుల మనోభావాలు దెబ్బతీస్తున్నందుకు ఈ షోలో పాల్గొన్న వారందరినీ అరెస్ట్ చేయాలని హెచ్ఎంకే సభ్యుడు ఒకరు డిమాండ్ చేశారు. ఈ షోలో అసభ్యకరమైన, అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, దీని వల్ల తమిళ , భారతీయ సంస్కృతి దెబ్బతింటున్నాయని ఆ సంస్థ పేర్కొంది.
జూన్ 24 నుంచి విజయ్ టీవీలో ప్రసారమవుతున్నఈ షోలో నైతిక విలువలు పాటించడం లేదని గతంలోనే హిందూ మున్నని కట్చి ఆరోపించింది. షోకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తూ అభ్యంతరాలను కూడా తెలియజేసింది. అయినా షో నిర్వహణ తీరు మారకపోవడంతో తాజాగా హిందూ మక్కల్ కట్చి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
తమిళ బిగ్ బాస్ ఆది నుంచి వివాదాస్పదంగా మారడంతో తెలుగు బిగ్ బాస్ షో పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగులో ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.