ద‌శాబ్దం త‌ర్వాత హిట్ ప్రాంచైజీకి సీక్వెల్!

Update: 2023-06-16 09:00 GMT
బాలీవుడ్ లో హిట్ ప్రాంచైజీలు నిరంత‌రం  తెర‌కెక్కుతూనే ఉంటాయి. రెండు.. మూడు ద‌శాబ్దాల క్రితం నాటి క‌థ‌ల్ని సైతం మ‌ళ్లీ తెర‌పైకి  రావ‌డం అక్క‌డ రీసైకిల్ ప్రాస‌స్ లాంటింది. బంప‌ర్ విజ‌యాలు ద‌క్కించుకోవ‌డం వాళ్ళకే చెల్లింది.

ప్ర‌స్తుతం ప‌లు హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ తెర‌కెక్కుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ద‌శాబ్ధ క్రితం నాటి హిట్ ప్రాంచైజీ 'ఫ‌క్రే'ని తెర‌పైకి తెస్తున్నారు.  'ఫ‌క్రే'లోని చూచా.. హ‌న్నీ లాంటి పాత్ర‌లు ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల మదిలో నిలిచిపోయాయి.

మృగ్దీప్ సింగ్ లాంబా తెర‌కెక్కించిన  'ఫ‌క్రే'..'ఫ‌క్రే రిట‌ర్న్స్' చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వసూళ్ల‌ని సాధించిన సంగ‌తి తెలిసిందే. 'ఫ‌క్రే' రిలీజ్ స‌మయంలో పెద్ద‌గా అంచ‌నాలు లేవు. ఓ సాధార‌ణ చిత్రంలా రిలీజ్ అయింది. కానీ ఆ సినిమా వ‌సూళ్లు చూసి ఇండ‌స్ట్రీని షాక్ అయింది.

ఈ నేప‌థ్యంలో ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ 'ఫ‌క్రే-3' సినిమా చేయ‌డానికి రంగం సిద్దం చేస్తున్నారు. 'ఫ‌క్రే' రిలీజ్ అయి ప‌దేళ్లు కూడా పూర్త‌వ్వ‌డంతో హిట్ సినిమాకి  సీక్వెల్ చేస్తే బాగుంటుంద‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తుంది.

ఇందులో  రిచా చ‌ద్దా...పుల్కిత్ సామ్రాట్..వ‌రుణ శ‌ర్మ‌.. మంజోత్ సింగ్.. పంక‌జ్ త్రిపాఠి ఇందులో కీల‌క పాత్ర‌ల‌కు ఎంపికైన‌ట్లు తెలుస్తుంది. ఎక్సెల్ ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ పై రితేష్ సిద్వానీ..ప‌ర్హాన్ అక్త‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభం కాకుండానే  రిలీజ్ తేదిని ప్ర‌క‌టించ‌డం విశేషం. 'జుగాడు' అబ్బాయిలు  డిసెంబ‌ర్ 1న  తిరిగి రానున్నార‌ని ప్ర‌క‌టించారు.

 దీన్ని బ‌ట్టి సినిమాకి సంబంధించి అప్పుడే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మైన‌ట్లు తెలుస్తుంది. ఓ కొత్త పోస్ట‌ర్ కూడా నెట్టింట వైర‌ల్ అవుతుంది. పోస్ట‌ర్ లో ఆద్యంతం ఫ‌న్ క‌నిపిస్తుంది. సినిమాలో మ‌రోసారి కామెడీనే హైలైట్ చేయ‌బోతున్న‌ట్లు  తెలుస్తోంది. ఇప్ప‌టికే  స్టోరీ  స‌హా న‌టీన‌టులు లాక్ అయ్యారు. సాంకేతిక నిపుణులు ఎవ‌ర‌న్న‌ది తె లియాల్సి ఉంది. అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ కానున్న‌ట్లు తెలుస్తోంది.

Similar News