సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ల లైనప్ గురించి అందరికి తెల్సిందే. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ లో పాల్గొంటున్న మహేష్ బాబు ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేయాల్సి ఉంది. ఆ సినిమా చిత్రీకరణ ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూ వాయిదా పడుతూ వచ్చింది. సర్కారు వారి పాట సినిమా తో సమాంతరంగా త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కాల్సి ఉన్నా కూడా ఇప్పటి వరకు క్లాప్ పడిందే లేదు.
త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఉంటుంది. మొత్తానికి ఈ మూడు సినిమాలు అయితే అభిమానులను ఊరిస్తున్నాయి కాని ఇప్పటి వరకు వాటి యొక్క ఆగమనం.. ఆరంభం గురించి క్లారిటీ లేకపోవడంతో అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఎట్టకేలకు ఆ విషయాలపై మహేష్ బాబు సన్నిహితుల నుండి ఫుల్ క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ ను హ్యాపీ చేస్తున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా ముగింపు దశకు తీసుకు వచ్చాడు. వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మే నెలలో సినిమా విడుదల అయితే జూన్ నెలలో త్రివిక్రమ్ కు డేట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వెంటనే జూన్ నెలలో సినిమాను పట్టాలెక్కించి సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లుగా త్రివిక్రమ్ సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.
ఇప్పటికే చాలా కాలం వృధా అయిన కారణంగా మహేష్ బాబు డేట్లు ఇవ్వడమే ఆలస్యం వెంటనే సినిమా ను పట్టాలెక్కించాలని త్రివిక్రమ్ ప్లాన్ చేయడం.. అది ఇదే ఏడాది నవంబర్ వరకు పూర్తి చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. ఇక మహేష్ బాబు తో రాజమౌళి చేయాల్సిన సినిమాకు సంబంధించి క్లాప్ కొట్టేది వచ్చే ఏడాది సంక్రాంతి సమయంలో లేదా ఆ వెంటనే అంటున్నారు.
ఇలా మూడు సినిమాలకు సంబంధించిన క్లారిటీ ని మహేష్ బాబు ఫ్యాన్స్ కు అనధికారికంగా అయినా ఇవ్వడంతో ఫ్యాన్స్ ఒకింత రిలాక్స్ అవుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ ఏడాది అంటే వచ్చే నెలలో సర్కారు వారి పాట సినిమా రాబోతుంది.
వచ్చే ఏడాది ఆరంభంలో త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబో రాబోతుంది. ఇక 2024 లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా తో మహేష్ బాబు రాబోతున్నాడు. ఇలా మూడు సినిమాలకు క్లారిటీ వచ్చేసింది.