టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా సినిమాలను బట్టి ఏ హీరోకైనా సరే క్రేజ్ పెరుగుతుంది. కానీ ఆ విధంగా కాకూండా కేవలం తన వ్యక్తిగతంతోనే అత్యధిక అభిమానులు సంపాదించుకున్న ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు రిలీజ్ అయ్యే ముందు వాతావరణం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమాకు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ ని కొంతమంది హీరోలు కూడా చాలా ఇష్టపడతారు. ఇక హీరోయిన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క సినిమా ఆయనతో నటిస్తే చాలు అనుకుంటారు. ఇక ఆయన నేమ్ ను వాడుకొని క్రేజ్ తెచ్చుకునే వారు లేకపోలేదు. ఇక అసలు విషయానికి వస్తే జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ పవర్ స్టార్ అభిమానులను టార్గెట్ చేసినట్లు అనిపిస్తోంది. అమ్మడు వారిని ఆకర్షించే విధంగా అజ్ఞాతవాసి సాంగ్ వింటూ కూర్చున్న చోటనే హావభావాలను తనదైన శైలిలో చూపించింది.
దీంతో ఆమె ఫాలోవర్స్ అనసూయా సూపర్ అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మెగా అభిమానులు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. గతంలో అమ్మడు అనవసరంగా అర్జున్ రెడ్డి జోలికి వెళ్లి అభిమానుల నుండి తీవ్ర విమర్శలను కొనితెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని ఆకర్షించి కొంచెం పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది.